ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన టిడిపి, బిజెపిల అధ్యాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగు దేశం - బిజెపిల అధ్యాయాలు ముగిసాయని ఎపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి అన్నారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా రాహుల్ గాంధీ నాయకత్వంలోనే సాధ్యమవుతుందని రఘువీరారెడ్డి మంగళవారం పార్టీ నేతలు ఎస్. శైలజానాథ్, ఎన్. తులసిరెడ్డి, గిడుగు రుద్రరాజు తదితరులతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది ముగిసిన అధ్యాయం అని బిజెపి అగ్ర నాయకుడు, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించడంపై రఘువీరా తీవ్రంగా ప్రతిస్పందించారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని, ముగిసింది టిడిపి-బిజెపిల అధ్యాయమేనని ఆయన విమర్శించారు. ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తామని బిజెపి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నదని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా విభజన బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగినప్పుడూ వెంకయ్యతో సహ ఆ పార్టీ నాయకులు ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టారని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా కోసం లోగడ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే మంత్రివర్గం తీర్మానం చేసి ప్రణాళికా సంఘానికి పంపించడం జరిగింది వాస్తవమా? కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెంటనే పార్టీ పగ్గాలు చేపట్టాల్సిన అవశ్యకత ఉందని అన్నారు. సిడబ్ల్యుసి తీర్మానం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తామూ రాహుల్‌కు ఈ మేరకు విజ్ఞప్తి చేస్తూ లేఖ రాయనున్నట్లు ఆయన చెప్పారు.