ఆంధ్రప్రదేశ్‌

డిస్కౌంట్ ధమాకా!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, నవంబర్ 9: రండి బాబూ రండి.. ఆలసించిన ఆశా భంగం.. మంచి తరుణం మించిన దొరకదు.. మీ దగ్గర ఉన్న రూ. వంద నోట్లు తీసుకురండి.. మా వద్ద ఉన్న రూ.వెయ్యి, రూ. 500 నోట్లు తీసుకువెళ్లండి.. 30 శాతం కమిషన్ తీసుకోండి.. ఇదీ బడాబాబులు ఇస్తున్న బంపర్ ఆఫర్. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని తగ్గించుకునేందుకు కర్నాటకలోని బెంగళూరు, బళ్ళారిలోని కొంతమంది బడాబాబులు పెద్ద నోట్ల మార్పిడికి ఇస్తున్న డిస్కౌంట్ ధమాకా ఇది. కర్నూలు జిల్లా నంద్యాలలోని తమ సన్నిహితుల ద్వారా వీరు నోట్ల మార్పిడికి శ్రీకారం చుట్టారు. వివరాల్లోకి వెళ్తే... రూ.వెయ్యి, రూ.500 నోట్లను ప్రధాని రద్దు చేసినట్లు ప్రకటించగానే అన్ని వర్గాల ప్రజల్లో కలకలం రేగింది. సామాన్యులపై ఈ ప్రభావం పెద్దగా లేకపోగా బ్యాంకు లాకర్లు, నేలమాలిగల్లో నోట్ల కట్టలు దాచిపెట్టిన బడాబాబుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వీరంతా తెల్లవారేసరికల్లా బంపర్ ఆఫర్లు ప్రకటించారు. రూ.70 లక్షల రూ.100, రూ.50 నోట్లు ఇస్తే కోటి రూపాయలకు రూ.1000, రూ.500 నోట్లు ఇస్తామని తమకు తెలిసిన వారిని, నోట్లు చెలామణి చేయగల సామర్థ్యం ఉన్న వారికి నోటి మాటగా కబురుపెట్టారు. ముఖ్యంగా కర్నాటక రాష్ట్రం నుండి భారీ ఎత్తున ఆఫర్లు వస్తున్నట్లు నంద్యాలలో గుప్పుమంటోంది. నంద్యాల ప్రాంతంతో వ్యాపార సంబంధాలు ఉన్న కర్నాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నేతలు, వ్యాపారులు తమ వద్ద దాచుకున్న నల్లధనాన్ని మార్చుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటిస్తుండడంతో ప్రజలు తెల్లబోతున్నారు. రూ.కోటి నుండి రూ. పది కోట్ల వరకు రూ.100, రూ.50 నోట్లు తీసుకువస్తే రూ.3 కోట్లు డిస్కౌంట్‌గా ఇస్తామని తమ సమీప వ్యక్తుల ద్వారా సమాచారం ఇస్తున్న వార్తలు నంద్యాలలో సంచలనం సృష్టిస్తున్నాయి.