ఆంధ్రప్రదేశ్‌

భూముల క్రమబద్ధీకరణకు ఒకే విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 11: ఆక్షేపణలేని భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి రాష్టవ్య్రాప్తంగా ఒకే విధానాన్ని అనుసరించాలని, ప్రస్తుతం అమలులో ఉన్న జీవో 118, 296లకు అనుగుణంగా క్రమబద్ధీకరణ మార్గదర్శకాలు రూపొందించి ఒకే జీవోను ప్రవేశపెట్టాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మునిసిపల్ మంత్రి నారాయణ, న్యాయశాఖ కార్యదర్శి దుర్గాప్రసాద్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జెసి శర్మ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, పురపాలకశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రధానంగా 118,296 జీవోలపైనే సుదీర్ఘంగా చర్చించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమించిన పేదలకు వంద గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఇందులో భాగంగా శ్లాబు ధరలు కూడా నిర్ణయించింది. అయితే వివిధరకాల జీవోల వల్ల ప్రజల్లో అయోమయం నెలకొందని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. భూముల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి రాష్టవ్య్రాప్తంగా ఒకే రకమైన విధానం అమలయ్యేలా నియమ, నిబంధనలు తయారుచేసి కేబినెట్ ముందు ఉంచాలని ఉపసంఘం సమావేశంలో మంత్రులు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం అర్బన్ మద్దెలపాలెం గ్రామం (కెఆర్‌ఎం కాలనీ) భూముల ఆక్రమణ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. చెరువు పోరంబోకు భూముల్లో ఇళ్లు నిర్మించినందున హైకోర్టు ఆదేశాల మేరకు భూముల క్రమబద్ధీకరణకు న్యాయపరమైన అన్ని అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని విశాఖ కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. 1968 మునిసిపాలిటీ ఆమోదించిన లేఅవుట్ మేరకు సామాన్యులు ఇళ్లు నిర్మించుకున్నారని స్థానిక ఎమ్మెల్యేలు వివరించారు. భూములు క్రమబద్ధీకరించకపోతే అధికారులు చేసిన తప్పిదానికి ఇళ్లు నిర్మించుకున్న ప్రజలు నష్టపోతారని ఎమ్మెల్యేలు మంత్రివర్గ ఉప సంఘం దృష్టికి తెచ్చారు. దీనిపై న్యాయనిపుణుల సలహాలు తీసుకుని ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై నివేదిక రూపొందించాలని అధికారులకు మంత్రులు సూచించారు. నివేదిక అందిన వెంటనే కేబినెట్‌కు నివేదించాలని నిర్ణయించారు.