రాష్ట్రీయం

కొలువులకు కొత్త గేమ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: విస్తృతమవుతున్న గేమింగ్ పరిశ్రమతో కొత్త కొలువులకు అవకాశం ఉందని, గేమింగ్ పరిశ్రమకు హైదరాబాద్‌లో ఉజ్వల భవిష్యత్ ఉందని ఐటి మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. గేమింగ్ పరిశ్రమతో మరిన్ని ఉద్యోగావకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. త్వరలో టి- హబ్ రెండో దశ భవనాన్ని మూడువేల చదరపు అడుగులతో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. హెచ్‌ఐసిసిలో నాస్కామ్ ఆధ్వర్యంలో గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌ను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా త్వరలో హైదరాబాద్‌లో నిర్మించే ఇమేజ్ టవర్స్ ఫస్ట్‌లుక్‌ను మంత్రి కెటిఆర్ విడుదల చేశారు. అత్యాధునిక డిజైన్‌లతో టవర్లు నిర్మించనున్నట్టు చెప్పారు. ట్విట్టర్ ద్వారా కెటిఆర్ ఈ డిజైన్లను విడుదల చేశారు. ఇన్నోవేషన్స్, మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిపి ఇమేజ్ అని పేరు పెట్టినట్టు చెప్పారు. నాలుగువైపులా నాలుగు టవర్లు కనిపించేలా నిర్మాణం ఉంటుందన్నారు. అనంతరం గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో వందకుపైగా ప్రముఖ గేమింగ్ సంస్థలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో గేమింగ్ ఇండస్ట్రీలో 30వేల మంది పని చేస్తున్నారని చెప్పారు. బాహుబలి, మగధీర, ఈగ, లైఫ్ ఆఫ్ పైలాంటి పెద్ద సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ హైదరాబాద్‌లోనే జరిగాయమన్నారు. గేమింగ్ ఇండస్ట్రీలో ఉపాధి అవకాశాలు మరింతగా పెంచాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. గేమింగ్, మల్టీమీడియా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇస్తోందన్నారు. తెలంగాణ టెక్నాలజీ పేరుతో నగరంలో భారీ ఇంక్యుబేటర్ నిర్మించనున్నట్టు కెటిఆర్ తెలిపారు. గేమింగ్ పరిశ్రమ కోసం ప్రత్యేక పాలసీ రూపొందించినట్టు చెప్పారు.