రాష్ట్రీయం

ఆర్టీసీ ఎండీగా మాలకొండయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 13: రాష్ట్రంలో భారీ ఎత్తున ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 17 మంది ఐఎఎస్, 9 మంది ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ ఠక్కర్ ఆదివారం ఉత్తుర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్-వైస్ చైర్మన్‌గా సీనియర్ ఐపిఎస్ అధికారి డిజి డాక్టర్ ఎం మాలకొండయ్య నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న 1984 బ్యాంచ్‌కు చెందిన నండూరి సాంబశివరావు మూడు మాసాలుగా ఫుల్ అడిషనల్ చార్జీ హోదాలో డిజిపిగా కొనసాగుతున్నారు. మాలకొండయ్య ఇప్పటి వరకు ఎసిబిలో కొనసాగుతున్నారు. శాంతిభద్రతల విభాగంలో డిజిగా కొనసాగుతున్న 1986 బ్యాచ్‌కు చెందిన ఆర్‌పి ఠాగూర్ మాలకొంయ్య స్థానంలో నియమితులయ్యారు. 1993 బ్యాచ్‌కు చెందిన ప్రొవిజనల్ లాజిస్టిక్ ఐజి జె అమిత్‌గార్గ్ సిఐడికి బదిలీ అయ్యారు. అక్కడ పనిచేస్తున్న 1998 బ్యాచ్‌కు చెందిన డిజి కె సత్యనారాయణ అగ్నిమాపక శాఖకు బదిలీ కాగా అగ్నిమాపక శాఖలో పని చేస్తున్న టివి త్రిపాఠికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయమన్నారు. 1997 బ్యాచ్‌కు చెందిన ఐజిసి ఎన్ మధుసూధనరెడ్డిని లాజిస్టిక్ విభాగానికి బదిలీ చేశారు. 1990 బ్యాచ్‌కు చెందిన టెక్నికల్ సర్వీసెస్ అడిషనల్ డిజిపి అంజనాసిన్హాను వ్యక్తిగత విభాగానికి బదిలీ చేశారు. 1992 బ్యాచ్‌కు చెందిన టెక్నికల్ సర్వీసెస్ ఐజిపి హరీష్‌కుమార్ గుప్తాను శాంతి భద్రతల విభాగానికి బదిలీ చేశారు. 1998 బ్యాచ్‌కు చెందిన లీగల్ విభాగం ఐజిపి ఇ దామోదర్‌ను టెక్నికల్ సర్వీసెస్‌కు బదిలీ చేశారు.
ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ బి ఉదయలక్ష్మిని ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్‌గాను, పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న జిఎస్ పండాదాస్ ఉన్నత సాంకేతిక విద్యా స్పెషల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఎంవి శేషగిరిబాబును ప్రకృతి వైపరీత్యాల విభాగం డైరెక్టర్‌గా, జె.నివాస్‌ను పరిశ్రమ వౌలిక సదుపాయాల సంస్థ ఎండిగా, రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కెవిఎన్ చక్రధర్‌ను శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గా, తిరుపతి సబ్ కలెక్టర్ హిమాంశు శుక్లాను పర్యాటక శాఖ డైరెక్టర్‌గా, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్తీక బాత్రాను గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, రంపచోడవరం సబ్ కలెక్టర్ పఠన్‌శెట్టి రవి సుభాష్‌ను పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్‌గా, విజయవాడ సబ్ కలెక్టర్ జి సృజనను పదోన్నతిపై విశాఖపట్టణం జాయింట్ కలెక్టర్‌గా, నూజివీడు సబ్ కలెక్టర్ జి లక్ష్మీసాను పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా, నరసాపురం సబ్ కలెక్టర్ విఎస్ దినేష్‌కుమార్‌ను రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌గా, పాడేరు సబ్‌కలెక్టర్ శివశంకర్ లోతేటిని సీతంపేట ఐటిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా, విజయవాడ సబ్ కలెక్టర్‌గా ఎస్ సలోనిని, నరసాపూర్ సబ్ కలెక్టర్‌గా సుమత్‌కుమార్‌ను, తిరుపతి సబ్ కలెక్టర్‌గా నితీష్‌కుమార్‌ను, మదనపల్లి సబ్ కలెక్టర్‌గా కె నెట్రిశెల్విని, పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎన్ బంగారురాజును శాప్ చైర్మన్-ఎండిగా నియమించారు. శాప్ చైర్మన్‌గా ప్రస్తుతం ఉన్న జి.రేఖారాణికి పోస్టింగ్ ఇవ్వలేదు.

చిత్రం.. ఎం మాలకొండయ్య