రాష్ట్రీయం

బంపర్ ఆఫర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 13: కర్నూలు జిల్లాలో నల్లకుబేరులు ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కొత్త రూ. 2000 నోటు ఇస్తే రూ. 2,500(పాతవి ఐదు రూ. 500నోట్లు) ఇస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో సామాన్యులు తమవద్ద ఉన్న ఆయా నోట్లను తీసుకెళ్లి గంటల తరబడి క్యూలో నిల్చొని మార్పిడి చేసుకున్నారు. అయితే బ్యాంకర్లు రూ. 2000 నోట్లు ఇవ్వడంతో సగటు జీవి చిల్లర కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇదే అదనుగా భావించిన నల్లకుబేరులు రూ. 2000 నోట్లు కొనుగోలు చేయడానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా రూ. 2 వేల నోట్లు రెండు ఇస్తే రద్దయిన పాత నోట్లు రూ. 4,500 ఇవ్వడానికి సిద్ధపడి ఆ మేరకు తమ అనుచరుల ద్వారా జనంలో ప్రచారం ప్రారంభించారు. ఒక్క నోటు మాత్రమే ఉందంటే వారికి రూ. 2,500 ఇవ్వడానికి కూడా అంగీకరిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ మేరకు అవినీతి, అక్రమార్కుల అనుచరులు కొందరు రంగంలోకి దిగి సామాన్యుల వద్దకు వెళ్లి రూ. 2000 నోటు తీసుకుని రూ. 2,500(రద్దయిన ఐదు రూ. 500 నోట్లు) ఇస్తున్నారు. అవి తీసుకుని ప్రజలు మళ్లీ బ్యాంకులకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే తమనుంచి కొత్త నోట్లు తీసుకున్న వారి పేరును బయట పెట్టవద్దని నల్లకుబేరుల అనుచరులు హుకుం జారీ చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా రద్దయిన నోట్ల చెలామణికి పలువురు దుకాణదారులు వినియోగదారులు కొనుగోలు చేసిన సరుకు విలువకు అదనంగా రూ. 50 తీసుకుని చిల్లర ఇస్తున్నట్లు తెలుస్తోంది. తమకు వచ్చే రూ. 50తో బ్యాంకుల చుట్టూ తిరగడానికి ఖర్చులకు ఉపయోగపడుతుందని షాపుల యజమానులు వెల్లడిస్తున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారాన్ని కొందరు వ్యాపారులు సైతం అంగీకరిస్తూ తామేమీ అక్రమం చేయడం లేదని వినియోగదారులు చేయాల్సిన పని తాము చేస్తుండటంతో తమకు ఆ మేరకు ఖర్చు అవుతుందని వివరణ ఇస్తుండటం విశేషం. చిల్లర లేని కారణంగా తాము వినియోగదారులను వెనక్కి పంపితే తమకు నష్టమే కాక ప్రజలు కూడా ఇబ్బందులు పడతారని, దీని వల్ల తమకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని పేర్కొంటున్నారు.