రాష్ట్రీయం

బలహీనమైన ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: ‘తెలంగాణలో అత్యంత బలహీనమైన ప్రభుత్వం ఉంది..’ అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్ రావు విమర్శించారు. ప్రతిపక్షాలు ఇంకా ప్రత్యక్ష రాజకీయ పరీక్షలకు దిగలేదని అన్నారు. ‘్భవిష్యత్తులో ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యంపై సోషల్ మీడియా ప్రభావం’ అనే అంశంపై ‘్భరత్-నితి’ సంస్థ ఆదివారం ఇక్కడ నిర్వహించిన చర్చా గోష్టికి మురళీధర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభికులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిస్తూ తెలంగాణ ప్రభుత్వంపై వాగ్బాణాలు సంధించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే బలహీనమైన ప్రభుత్వం తెలంగాణలో ఉన్నదని విమర్శించారు. ప్రతిపక్షాలు ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయ పోటీ పరీక్షలకు దిగలేదు కాబట్టే ప్రభుత్వం బలంగా ఉన్నదని అనుకుంటున్నారని అన్నారు. అందుకే దొడ్డిదారిన, నగ్నంగా, అవినీతిపరంగా ప్రజాప్రతినిధులను ఆకర్షిస్తున్నదని ఆయన విమర్శించారు. 500, 1,000 రూపాయల నోట్లను ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేయడం కుటుంబ పాలన నడ్డివిరిచే చర్య అని మురళీధర్ రావు అన్నారు. బిజెపి కుటుంబ పాలన పార్టీ కాదని, బిజెపిలో ప్రజాస్వామ్యం ఉందని ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో హైదరాబాద్‌లో ఉండే ఐఎస్‌ఐ దిమ్మ తిరిగిందని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తమ పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహం ఖరారు చేస్తున్నట్లు చెప్పారు.
గోడ కట్టే యత్నం..
సార్వత్రిక ఎన్నికలకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీకి, ప్రజలకు మధ్య గోడ కట్టేందుకు మీడియా ప్రయత్నించిందని ఆయన విమర్శించారు. ఇది గమనించిన మోదీ సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రజలతో చర్చించారని, ఆ ఎన్నికలకు ఇది దోహదపడిందని అన్నారు. స్వచ్ఛ భారత్ ‘లోగో’ కూడా ప్రజల నుంచి వచ్చిన సూచనే అని ఆయన తెలిపారు. దేశ వ్యవస్థలో మార్పు రావాలని యువత కోరుకుంటున్నదని అన్నారు. పత్రిక ముద్రించిన తర్వాత మళ్లీ ముద్రణకు 24 గంటల సమయం పడుతుందని, పైగా పేజీల్లో స్థలాభావం ఉంటుందని, కానీ సోషల్ మీడియాలో ఎంత సమాచారమైనా చేరవేయవచ్చని, స్థలం సమస్యే ఉండదని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో సోషల్ మీడియా ప్రభుత్వాల పని తీరును మార్చనున్నదని అన్నారు.తన పని తీరును, తన మంత్రివర్గ పని తీరును సమీక్షించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ కోరారని, గతంలో ఎప్పుడూ ఇలా ఎవరూ కోరలేదని మురళీధర్ రావు చెప్పారు. ఇలాఉండగా ఫేస్ బుక్‌లో మిలియన్ ప్రజలు ‘లైక్’లో ఉన్న మురళీధర్‌రావుతో నిర్వాహకులు కేక్ కట్ చేయించారు.