రాష్ట్రీయం

ముద్రగడ గృహ నిర్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, నవంబర్ 15: కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండుతో బుధవారం నుండి సత్యాగ్రహ పాదయాత్ర జరప తలపెట్టిన మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను పోలీసులు మంగళవారం సాయంత్రం నుండి గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ నెల 16 నుండి 21 వరకు తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం నుండి అంతర్వేది వరకు సత్యాగ్రహ యాత్ర నిర్వహిస్తామని ముద్రగడ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కిర్లంపూడిలోని తన ఇంటి నుండి అనుచరులతో రావులపాలెం వెళ్లడానికి కార్లలో బయల్దేరిన ముద్రగడను పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్టుచేస్తున్నట్టు ప్రకటించారు. దీనితో ఆయన వెనుతిరిగి ఇంటిలోకి వెళ్లిపోయారు. అనంతరం ముగ్గురు పోలీసు అధికారులు ముద్రగడ ఇంట్లోకి వెళ్లి ఉన్నతాధికారులు ఇచ్చిన 48 గంటల హౌస్ అరెస్టు ఆదేశాల గురించి వివరించారు. దీనిపై స్పందించిన ముద్రగడ పోలీసు అధికారులకు పలు ప్రశ్నలు సంధించారు. తన హౌస్ అరెస్టుకు సంబంధించి లిఖితపూర్వక ఉత్తర్వులు ఉన్నాయా అని ప్రశ్నించారు. అందుకు పోలీసు అధికారులు వౌనం దాల్చారు. ‘మీ పరిస్థితి నాకు తెలుసు, ఇంతకు మించి ఏం చేయగలరు? హౌస్ అరెస్టు గడువు దాటాక పాదయాత్రకు అనుమతిస్తారా?’ అని ప్రశ్నించారు. అప్పుడూ పోలీసు అధికారుల నుండి వౌనమే సమాధానమైంది. గతంలో వైఎస్సార్, వైఎస్ జగన్, షర్మిల, చంద్రబాబు పాదయాత్రలు చేసినప్పడు వారికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పత్రాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు కూడా పోలీసు అధికారులు సరైన వివరణ ఇవ్వలేకపోయారు. దీనితో తనకు ఎప్పుడు స్వేచ్ఛనిస్తే అప్పుడే తిరిగి సత్యాగ్రహ పాదయాత్ర తేదీని ప్రకటిస్తానని ముద్రగడ వారికి స్పష్టం చేశారు. అప్పటికే అక్కడ పలువురు ఉద్యమ నాయకులు ఉండటంతో పోలీసు అధికారుల ఇబ్బందిని గమనించిన ముద్రగడ అక్కడున్న ఇతరులను బయటకు పంపించివేసి, వారితో కొంతసేపు విడిగా మాట్లాడారు. కాపు జెఎసి నేతలు వాసిరెడ్డి ఏసుదాసు, ఎవి రమణ, గౌతు స్వామి తదితరులు ముద్రగడ వెంట ఉన్నారు.
పోలీసుల అదుపులో
జెఎసి నేత ఆకుల
కాపు ఉద్యమ నాయకుడు, ముద్రగడ ప్రధాన అనుచరుల్లో ఒకరైన ఆకుల రామకృష్ణను మంగళవారం సాయంత్రం రావులపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రావులపాలెం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన రామకృష్ణ సత్యాగ్రహ పాదయాత్ర ప్రారంభం కానున్న రావులపాలెంలోని కళా వెంక్రటావు సెంటర్‌లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అనూహ్యంగా పోలీసులు రామకృష్ణను అదుపులోకి తీసుకుని, పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుండి వేరే ప్రాంతానికి తరలించారు. ఆయనతోపాటు రావులపాలెం మండల కాపు సంఘం అధ్యక్షుడు తాడాల శ్రీనివాస్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఎక్కడికి తరలించారనే దానిపై స్థానిక పోలీసులు స్పష్టత ఇవ్వలేదు.

చిత్రం.. సహచరులతో ముచ్ఛటిస్తున్న ముద్రగడ పద్మనాభం