రాష్ట్రీయం

ఖజానాపై కుంపటి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: పెద్ద నోట్ల రద్దు ప్రభావం రాష్ట్ర ఖజానాపై ఎలా ఉండబోతుంది? ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న శాఖల భవిష్యత్ పరిస్థితి ఏమిటీ? ఉపద్రవం నుంచి బయటపడటానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యయనం చేస్తుంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావంపై శాఖలవారీగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా సిఎస్ రాజీవ్‌శర్మ ఆదేశించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో మంగళవారం సచివాలయంలో సిఎస్ సమావేశమయ్యారు. పెద్ద నోట్ల ప్రభావం వల్ల తమ కొత్త రాష్ట్రం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొబోతుందో ప్రధాని మోదీ దృష్టికి సిఎం కెసిఆర్ తీసుకెళ్లనుండటంతో, నివేదికలను సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆదేశించినట్టు అధికారవర్గాల సమాచారం. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్ర ఆదాయంపై పడే ప్రభావంపై ప్రతీ రోజు సమావేశంకావాలని రాజీవ్ శర్మ ఆదేశించారు. దీనిపై శాఖల వారీగా లోతుగా అధ్యయనం చేయాలన్నారు. శాఖలకు చెందిన అధికారులతో మాత్రమేకాకుండా ఆయా రంగాలకు చెందిన సంస్థలు, నిపుణులతో సమావేశం కావాలని సూచించారు. ఈ ప్రభావం తాత్కాలికంగా ఎలా ఉంటుంది, దీర్ఘకాలికంగా ఎలా ఉంటుందనే కోణాల్లో అధ్యయనం జరగాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించి గత ఏడు నెలలలో వచ్చిన ఆదాయంతోపాటు నోట్ల రద్దు తర్వాత నవంబర్‌లో వచ్చిన ఆదాయాన్ని శాఖాధిపతులను సిఎస్ రాజీవ్ శర్మ అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల ద్వారా రాబోయే మాసాలలో లభించే ఆదాయం, గ్రాంట్స్, తదితర అంశాలపై రాజీవ్ శర్మ సమీక్షించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ తగిన వ్యూహాన్ని రూపొందించుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.