రాష్ట్రీయం

రాష్ట్రంలో రావణుడి పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, నవంబర్ 15: సత్యాగ్రహ పాదయాత్రకు పూనుకున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభాన్ని మంగళవారం పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీంతో ఆయన పాదయాత్రను వాయిదా వేసుకుంటున్నానని, విడుదల తరువాత మళ్లీ ప్రారంభిస్తానని ప్రకటించారు. బ్రిటిష్ హయాంలోనూ లేనంత నిర్బంధకాండను ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. తమ కోర్కెల సాధన కోసం గాంధేయ మార్గంలో సత్యాగ్రహ పాదయాత్ర నిర్వహించాలని భావిస్తున్న తనను హౌస్ అరెస్టు చేయడం దారుణమన్నారు. మంగళవారం సాయంత్రం తనను హౌస్ అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించిన అనంతరం ముద్రగడ తన స్వగృహంలో విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో రావణాసురుడి పాలన కొనసాగుతోందన్నారు. పక్కనున్న తెలంగాణా రాష్ట్రంలో ప్రజలు సుఖంగా జీవిస్తుంటే ఇక్కడ మాత్రం కక్షలు, కార్పణ్యాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. ఉన్నత న్యాయస్థానం ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు తప్పు కాదన్న భావనతో ప్రజల పక్షాన్న తీర్పు ఇచ్చినప్పటికీ చంద్రబాబు పోలీసు పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత వరకూ అమలవుతోందో ఈ రోజు కాపులపై సిఎం చంద్రబాబు జరుపుతున్న అకృత్యాలవల్ల స్పష్టమవుతోందన్నారు. ఇదే పరిస్థితి రేపు ఇతర వర్గాలకూ ఎదురవుతుందన్నారు. బ్రిటీష్ వారి పాలన గూర్చి పెద్దలు చెప్పడం విన్నామని, అంతకుమించి రాష్ట్రంలో నిర్బంధకాండను తాము స్వయంగా అనుభవిస్తున్నామన్నారు. కాంగ్రెసు హయాంలో చంద్రబాబు పాదయాత్ర నిర్వహిస్తే వేసవి కాలమైనందున ప్రతిపక్ష నేత కాళ్లు ఎక్కడ కందిపోతాయోనని అప్పటి ముఖ్యమంత్రి తారు రోడ్డుకు గ్రావెల్ పోయించి తడిపిన అనంతరం నడిపించారనే సంగతి మరిచిపోయారన్నారు. అప్పట్లో జడ్పీ, ఆర్‌అండ్‌బి అధికారులు ఉత్తర్వులు సైతం లేకుండా నిధులు వెచ్చించారని అయన గుర్తుచేశారు.
కాపులు ఉద్యమిస్తేనే ప్రభుత్వానికి చట్టాలు గుర్తుకువస్తాయా అని ఆయన నిలదీశారు. 144, 30 సెక్షన్లు 2019 వరకూ కొనసాగిస్తారా అని ప్రశ్నించారు. బుధవారం నుండి నిర్వహించాల్సిన సత్యాగ్రహ పాదయాత్రను వాయిదా మాత్రమే వేస్తున్నామని, యాత్రను రద్దుచేయలేదని ముద్రగడ స్పష్టంచేశారు. ప్రభుత్వ ఆంక్షలు తొలగించిన అనంతరమే తిరిగి పాదయాత్ర తేదీని ప్రకటిస్తానని ఆయన తెలిపారు.
భారీగా పోలీసుల మోహరింపు
కాగా మంగళవారం ఉదయం నుండీ ముద్రగడ ఇంటి ఆవరణ అభిమానులు, కాపునాయకులు, కాపు యువతతో కిక్కిరిసిపోయింది. ముద్రగడ ఇంటి బయట వేలాదిగా పోలీసులు నిఘా ఉంచారు. కిర్లంపూడిలో సుమారు 6వేల మందికి పైగా పోలీసులు గ్రామంలోని అన్ని వీధుల్లో మోహరించారు.

చిత్రం.. హౌస్ అరెస్టు విషయాన్ని ముద్రగడకు వివరిస్తున్న పోలీసు అధికారులు