రాష్ట్రీయం

కొందరి కోసం ఇందరికి కష్టాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, నవంబర్ 15: దేశంలో కొద్దిసంఖ్యలో ఉన్న నల్లకుబేరుల కోసం యావత్ దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరైన నిర్ణయం కాదని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లధనాన్ని నిరోధించే పేరుతో దేశాన్ని స్తంభింపచేయడం ఏమిటని ప్రశ్నించారు.
నల్లధనంపై యుద్ధం చేస్తున్నానంటూ ప్రజలను భయాందోళనకు గురిచేసే విధంగా ప్రధాని మోదీ ప్రకటనలు చేశారని ఆరోపించారు. నేటి అర్ధరాత్రి నుంచి 500, 1000 నోట్లు చిత్తుకాగితాలతో సమానం అంటూ ప్రకటించడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని చెప్పారు.
సుమారు 130 కోట్ల మంది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న నిర్ణయం తీసుకునే ముందు దాని పర్యవసానాలు, నగదు చేతుల్లో లేకపోతే జరిగే పరిణామాలను అంచనా వేయటం అవసరమని అన్నారు. కేంద్రం నిర్ణయంతో 90 శాతం మేర నగదు లావాదేవీల మీద నడిచే గ్రామీణుల జీవితాలు దుర్భరంగా మారిపోయాయని అన్నారు. చేతుల్లో ఉన్న డబ్బు చెల్లక, చెల్లే డబ్బు కోసం బ్యాంకుల ముందు నిరీక్షించే వారు పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. దినసరి కూలీలు, గ్రామీణ ప్రాంత కూలీలు, ఆటోవాలాలు, చిరువ్యాపారులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఈ నిర్ణయం వల్ల ఏ మేరకు నల్లధనం నిర్మూలన అవుతుందో తెలియదు కాని తనపై నమ్మకం ఉంచిన ప్రజల కష్టాలు మాత్రం ఇప్పట్లో తీరవని అన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా నోట్లను రద్దు ఎలా చేస్తారని నిలదీశారు. ప్రధాని నిర్ణయంతో ఏర్పడుతున్న కష్టాలను సరిచేసేందుకు యుద్ధప్రాతిపాదికన చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

చిత్రం.. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఉండవల్లి