రాష్ట్రీయం

నేషనల్ అకడమిక్ డిపాజిటరీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: దేశ వ్యాప్తంగా విద్యార్థుల డేటాబేస్ నిర్వహించేందుకు జాతీయ స్థాయిలో నేషనల్ అకడమిక్ డిపాజిటరీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా ప్లస్ టు స్థాయి నుండి ఉన్నత విద్య అభ్యసించే ప్రతి ఒక్కరి వివరాలు ఈ నేషనల్ అకడమిక్ డిపాజిటరీలో అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల డిగ్రీలు, డిప్లోమోలు, సర్ట్ఫికెట్లు, మార్కుల జాబితాలు, కోర్సుల వారీ అభ్యర్థుల పేర్లు వారి ఆధార్ నెంబర్లు ఈ డిపాజిటరీలో ఉంటాయి. ఆధార్ నెంబర్ ఆన్‌లైన్‌లో పరిశీలించగానే ఆ అభ్యర్థి చదువు వివరాలు అన్నీ ప్రత్యక్షమవుతాయి. అలాగే అభ్యర్థి వేలిముద్రలు పరిశీలించగానే ఆధార్ నెంబర్‌తో పాటు ఆయన చదువు వివరాలు వస్తాయి. అభ్యర్థి ప్రకటించుకున్న విద్యార్హతలు అన్నీ సరైనవేనా కాదా అన్నది క్షణంలో తేలిపోతుంది. ప్రస్తుతం నకిలీ సర్ట్ఫికెట్లు పొంది వాటిని సమర్పించడం ద్వారా ఉద్యోగాలు పొందుతున్న వారి ఆటలు ఇక సాగకుండా ఈ చర్యలు చేపడుతున్నారు. అదే విధంగా విదేశాలకు వెళ్లే అభ్యర్థులకు వీసా జారీ, పాస్‌పోర్టుల జారీ వంటి సందర్భాల్లోనూ కేంద్రం అభ్యర్థుల క్రెడిన్షియల్స్‌ను పరిశీలించేందుకు నేషనల్ అకడమిక్ డిపాజిటరీ ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థ ఎన్‌ఎస్‌డిఎల్ డాటాబేస్ మేనేజిమెంట్ లిమిటెడ్ (ఎన్‌డిఎంఎల్), సిడిఎస్‌ఎల్ వెంచర్స్ లిమిటెడ్( సివిఎల్) ఆధీనంలో ఉంటుంది.
ఈ రెండూ సెబి చట్టం పరిధిలో పనిచేస్తుంటాయి. కేంద్ర విశ్వవిద్యాలయాలు, దేశంలో జాతీయ స్థాయి ప్రసిద్ధ ఉన్నత విద్యాసంస్థలు, జాతీయ ప్రాధాన్యం ఉన్న సంస్థలు నుండి సమాచారాన్ని సేకరించి యుజిసి ఈ డిపాజిటరీకి అందించేలా బాధ్యత తీసుకుంటుంది. అలాగే ఎన్‌సిటిఇ, ఎఐసిటిఇ వంటి జాతీయ పర్యవేక్షణ సంస్థలు కూడా భాగస్వామ్యం అవుతాయి. ఈ మేరకు ఈ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటారు. విద్యాసంస్థలు కూడా ఎన్‌డిఎంఎల్, సిడిఎస్‌ఎల్‌లో ఏదో ఒక సంస్థను ఎంచుకుని అవగాహన ఒప్పందం కుదుర్చుకుని సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు కేంద్రం ఓ స్టీరింగ్ కమిటీని నియమించింది. ఈ కమిటీకి కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో యుజిసి చైర్మన్, ఎఐసిటిఇ చైర్మన్, సిఎబిఇ చైర్మన్, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నుండి పాఠశాల విద్యా విభాగం ప్రతినిధి, కేంద్ర సమాచార సాంకేతిక విజ్ఞాన శాఖ, ఆర్ధిక శాఖ, ఆరోగ్యం -కుటుంబ సంక్షేమ శాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖ, ఆయుష్, వికలాంగుల మంత్రిత్వశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, న్యాయ శాఖ, మానవ వనరులాభివృద్ధి శాఖ స్టాటిస్టిక్స్ విభాగం ప్రతినిధి, ఇతర ప్రత్యేక ప్రతినిధులు, ఉన్నత విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ ఈ స్టీరింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఎఐసిటిఇ, ఎన్‌సిటిఇ, పిసిఐ, ఎంసిఐ, బిసిఐ, సిసిహెచ్, డిసిఐ, ఐఎన్‌సి, ఆర్‌సిఐ, సిసిఐఎం తదితర అపెక్స్ సంస్థల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారు.