రాష్ట్రీయం

కొత్త నోట్లు... ‘వంద’ తిప్పలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: రద్దయిన పెద్ద నోట్ల మార్పిడి కోసం వారం రోజులుగా ఆర్‌బిఐ వద్ద భారీ క్యూ కొనసాగుతోంది. నోట్ల మార్పిడి కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కొత్త నోట్లు తీసుకున్నా.. చిల్లర బాధలు తప్పడం లేదు. ఆసుపత్రుల్లో, మెడికల్ షాపుల్లో పాత నోట్లు, డెబిట్ కార్డులతో చెల్లింపులు జరుపుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఆసుపత్రులు, మెడికల్ షాపుల యజమానులు వాటిని తిరస్కరిస్తున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు.
అదేవిధంగా బ్యాంకుల్లో వంద నోట్ల కొరత భారీగా ఏర్పడింది. పాతనోట్లు రద్దయిన కారణంగా వాటిని మార్పిడి చేసుకునేందుకు జనం బ్యాంకులకు భారీగా ‘క్యూ’ కడుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 500, 1000 నోట్లు రద్దు కాగా, పాత రూ. వంద నోటు వినియోగంలో ఉండడంతో ప్రజలు వంద రూపాయల నోట్ల కోసం ఎగబడుతున్నారు. కొత్త నోటు తీసుకున్నా.. చిల్లర కావాలంటే పాత వంద నోట్లు కావాల్సిందే. దీంతో ప్రతి ఒక్కరూ వంద నోట్లకే ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రజలకు, బ్యాంక్ అధికారులకు ఇక్కట్లు తప్పడం లేదు. తొలి విడత మినహా బ్యాంకులకు వంద రూపాయల నోటు సప్లయి కాకపోవడంతో అధికారులు ఏమీ చేయలేక తలపట్టుకుంటున్నారు. నోట్ల కొరత కారణంగా ఏటిఎంలలో డబ్బులు పెట్టడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజల బాధలు మరింత ఎక్కువయ్యాయి.
డెబిట్ కార్డుల నిరాకరణ..
హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం రోగులకు నరకం చూపిస్తోంది. బిల్లులను నగదు రూపంలో, లేదా క్రెడిట్ కార్డుల ద్వారా మాత్రమే చెల్లించాలని షరతు విధించింది. డెబిట్ కార్డుల ద్వారా చెల్లిస్తామని రోగుల తరఫు బంధువులు చెబుతున్నా నిమ్స్ సిబ్బంది ఒప్పుకోవడం లేదు. డెబిట్ కార్డులను స్వైప్ చేసే మిషన్ తమ వద్ద లేదని వారు చెబుతున్నారు. మరోవైపు బిల్లులు చెల్లించకపోతే పేషెంట్లను డిశ్చార్జ్ చేయబోమని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లు ఉన్నాయని, తమ వద్ద క్రెడిట్ కార్డులు లేవని, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని ఆసుపత్రి సిబ్బందిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము డబ్బులు చెల్లించడానికి ఉన్న ఏకైక మార్గం డెబిట్ కార్డేనని వాపోతున్నారు.