రాష్ట్రీయం

జనం వద్దకే ఎటిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, నవంబర్ 17: గత పది రోజులుగా ఎటిఎంల వద్దకు ప్రజలు పరుగులు పెడుతుంటే... గురువారం ఏకంగా ఎటిఎంలే జనం మధ్యకు వచ్చాయ. ఎస్‌బిఐ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బ్రాంచి అధికారులు గురువారం మొబైల్ ఎటిఎం సేవలను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. కార్డు ద్వారా డబ్బులు తీసుకునే వెసులుబాటును కల్పించారు. బ్యాంకు వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని బ్యాంకుల ఖాతాదారులకు కార్డుద్వారా డబ్బులు చెల్లించినట్లు ఎస్‌బిఐ మేనేజర్ కృష్ణకిషోర్ శర్మ తెలిపారు. పట్టణంలో జాతీయ రహదారిపై పలుచోట్ల కారులో ఎటిఎం సేవలను అందజేశారు. ఎస్‌బిఐ సేవలపై సంతోషం వ్యక్తంచేశారు. ఏ బ్యాంకు ఖాతాదారులైనా వీరు డబ్బులు అందజేశారు. కార్డుద్వారా రూ. 2000 కొత్త నోటును అందించారు. బ్యాంకుల్లో రద్దీని తగ్గించేందుకు మొబైల్ ఎటిఎంలను ప్రవేశపెట్టినట్లు మేనేజర్ తెలిపారు.

చిత్రం.. జహీరాబాద్‌లో మొబైల్ ఎటిఎం వద్ద నగదు విత్‌డ్రా చేసుకుంటున్న స్థానికులు