రాష్ట్రీయం

మైఖేల్ ఫెరీరాకు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: మనీ సర్క్యులేషన్ స్కాంలో నిందితుడిగా ఉన్న మైఖేల్‌ఫెరీరా మరో నలుగురిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను నిలుపుదల చేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను హైకోర్టు ధర్మాసనం గురువారం తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం వద్ద పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఏ శంకర్ నారాయణ విచారించారు. రాష్ట్ర హోంశాఖ తరపున న్యాయవాది హెచ్ వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పైన హైకోర్టు సింగిల్ జడ్జి నవంబర్ 4వతేదీన స్టే ఇచ్చారన్నారు. పిటిషనర్లతరపున్యాయవాది డివి సీతారామమూర్తి వాదనలు వినిపించారు. ఈ కేసును విచారిస్తున్న కింది కోర్టు బెయిల్ దరఖాస్తులను పరిశీలించి, సిఆర్‌పిసి ప్రకారం తాజా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.