రాష్ట్రీయం

బాబుకు మరింత భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతమున్న సెక్యూరిటీ కన్నా భారీగా భద్రత సిబ్బందిని పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మావోయిస్టుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ముఖ్యమంత్రికి వారినుంచి ముప్పు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలకు సమాచారం అందింది. ముఖ్యమంత్రి సెక్యూరిటీ గ్రూప్‌లో కొత్తగా 290 మంది భద్రతా అధికారులు సిబ్బంది వచ్చి చేరారు. ఇందులో ఐదుగురు అదనపు సూపరింటెండెంట్స్, ఏడుగురు డిఎస్పీలు, 148 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు.