రాష్ట్రీయం

సంస్కరణలు రావాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: పెద్దనోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు దోహదపడే పక్షంలో ప్రధానికి మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. సంస్కరణలు కొనసాగి తీరాలని, అవి ఉన్నతస్థాయిలో పురోగమించడానికి దోహదపడాలని ఆకాంక్షించారు. ఆలోచనాపరులు, మేధావులు కలిసి పనిచేస్తే ఏదైనా విజయవంతం అవుతుందన్నారు. నల్లధనం నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంవల్ల సామాన్యులు, చిన్న వ్యాపారులు, అసంఘటిత వ్యాపార రంగంలో లావాదేవీలు నిర్వహించే వారు నష్టపోకుండా చూడాలని సూచించారు.
ప్రభుత్వం ఏ విధాన నిర్ణయం తీసుకున్నా కచ్చితంగా ప్రజలను పరిగణనలోకి తీసుకోవాలని, వారిని అభివృద్ధిలో భాగస్వాముల్ని చేయాలని ముఖ్యమంత్రి కోరారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల రాష్ట్ర ఆదాయంపై ప్రభావం ఎంత మేరకు ఉందనే అంశంపై క్యాంప్ కార్యాలయంలో గురువారం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్ర ఆర్థిక రంగంపైనా, ఆదాయంపైనా నోట్ల రద్దు ప్రభావాన్ని సమీక్షించారు. రిజిస్ట్రేషన్స్, ట్రాన్స్‌పోర్టు విభాగాల్లో ఆదాయం బాగా తగ్గిందని, ఎక్సైజ్, అమ్మకం పన్ను, వాణిజ్య పన్నులు తదితర రంగాలపై పడిన ప్రభావాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక వ్యవస్థలోని లోటుపాట్లను సవరించడానికి, ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత తీసుకురావడానికి ఉపయోగపడితే తప్పకుండా కేంద్ర నిర్ణయానికి మద్దతు ఇవ్వాల్సిందేనన్నారు. రెండున్నర లక్షలకు పైగా ఆదాయం/నగదు కలిగి ఉంటే బ్లాక్ మనీగా కాకుండా లెక్కలోకి రాని నగదుగా (అన్ అకౌంటెడ్ మనీ) పరిగణించాలని ముఖ్యమంత్రి సూచించారు. చిన్న, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని, అవసరమైన మేరకు వారికి మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి అన్నారు. అసంఘటిత, చిల్లర వ్యాపారం చేసుకునే వారికి కొన్ని మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత రాష్ట్రాల ఆదాయంపై ప్రభావం పడిందనే వాస్తవాన్ని కేంద్రం గ్రహించాలన్నారు.

చిత్రం.. పెద్దనోట్ల రద్దు ప్రభావంపై అధికారులతో సిఎం కెసిఆర్ సమీక్ష