రాష్ట్రీయం

ఖైదీల స్థితిగతులపై నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని జైళ్లలో బాల నేరస్తులు, మహిళా ఖైదీల స్థితిగతులు, జైళ్లలో వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని లీగల్ సర్వీసుల అధికారులను గురువారం హైకోర్టు ఆదేశించింది. ఏపి లీగల్ సర్వీసుల అథారిటీ సభ్యులు పంపిన లేఖను పిల్‌గా హైకోర్టు స్వీకరించింది. ఈ పిల్‌ను జస్టిస్ సివి నాగార్జున రెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కె జైస్వాల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించి పైవిధంగా ఆదేశించింది. అనంతరం ఈ కేసును నాలుగు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది.