రాష్ట్రీయం

ప్రధాని యుద్ధం చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: నల్లధనంపై ప్రధానమంత్రి నరేంద్రమోది యుద్దం చేస్తున్నారని ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ విసి ప్రొఫెసర్ టి.తిరుపతిరావు పేర్కొన్నారు. అవేర్‌నెస్ ఇన్ ఇండియా, హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం రాత్రి బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘నల్లదనం నిర్మూలన-నరేంద్రమోదీ’ అంశంపై సదస్సు జరిగింది. ఉస్మానియా విశ్వ విద్యాలయ మాజీ వైస్ చాన్స్‌లర్ టి.తిరుపతిరావు సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యవక్తలుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు హనుమాండ్లు హాజరయ్యారు.
సదస్సును ఉద్దేశించి లక్ష్మణ్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ రాద్దాంతం చేయటం హాస్యాస్పదమన్నారు. నోట్ల రద్దుపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నా ప్రజలు ఆర్ధం చేసుకుని సహరిస్తున్నారని తెలిపారు. తిరుపతిరావు మాట్లాడుతూ ప్రధాని మోదీ నల్లదనాన్ని నిర్మూలించటానికి కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగానే పెద్ద నోట్ల రద్దు అనివార్యమయ్యిందన్నారు.
ఆయా రాజకీయ పార్టీలు, గత ప్రభుత్వాలు చేయని ఈ సాహసోపేత నిర్ణయం హర్షించదగ్గదన్నారు. సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించుకోవాలి తప్ప రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. హనుమాండ్లు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ప్రభుత్వానికి పన్నులను తప్పని సరిగా చెల్లించాలని, ఇక మీదట నిజాయితీగా సంపాదించే డబ్బే నిలుస్తుందన్నారు. దేశ ఆర్థిక ప్రగతి మోదీ వల్లనే సాధ్యమన్నారు.