రాష్ట్రీయం

గండి మీరే పూడ్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రాలపై పడిన ప్రభావాన్ని నీతి అయోగ్‌తో అధ్యయనం చేయించాలని, రాష్ట్రాలకు తగ్గిన ఆదాయాన్ని కేంద్రమే భరించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు కేంద్రాన్ని కోరనున్నారు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రాష్ట్రాలపై పడిన ప్రభావాన్ని ప్రధాని మోదీకి వివరించడానికి శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రధానితో సిఎం సమావేశం కానున్నట్టు అధికార వర్గాల సమాచారం. నోట్ల రద్దుతో దారితీసిన పరిణామాలను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానికి సిఎం ప్రతిపాదనలను అందజేయనున్నారు. నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఎక్సైజు, వాణిజ్య పన్నులు, రియల్ ఏస్టేట్ రంగంపై పడిన ప్రభావంపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూపొందించిన నివేదికను లిఖిత పూర్వకంగా ప్రధాన మంత్రికి సమర్పించనున్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించడానికి నెలకు రూ.1200 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉందని, ఈ వాయిదాల చెల్లింపులను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే వరకు కనీసం ఆరు నెలల వరకు వాయిదా వేయాలని ముఖ్యమంత్రి కోరనున్నట్టు తెలిసింది. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడానికి ప్రధాన మంత్రి తీసుకున్న చర్యలకు రాష్ట్రం తరఫున సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి స్పష్టం చేయనున్నారని తెలిసింది. అయితే నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ఆదాయ పనర్న పరిమితి మొత్తాన్ని రూ.2.50 లక్షల కంటే ఎక్కువ పెంచాలని ముఖ్యమంత్రి సూచించనున్నట్టు తెలిసింది. నోట్ల రద్దు వల్ల చిరు వ్యాపారులు, అసంఘటిత వ్యాపారుల జీవనభృతికి విఘాతం కలుగకుండా కేంద్రం ఆదుకోవాలని సూచించనున్నట్టు తెలిసింది. కేంద్ర పన్నుల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన వాటా ప్రకారం రూ.956 కోట్లు ఇవ్వాల్సి ఉండగా గత నెల నుంచి దీనిని రూ.600 కోట్లకు కుదించి రూ.400 కోట్లకు కుదించారని, రాష్ట్ర వాటాను మునుపటి మాదిరిగా కోత పెట్టకుండా చెల్లించాలని ముఖ్యమంత్రి తన నివేదికలో కోరనున్నట్టు తెలిసింది. మిగతా రాష్ట్రాల కంటే నోట్ల రద్దు ప్రభావం కొత్త రాష్టమ్రైన తెలంగాణపై అధికంగా ఉంటుందని, కొత్త రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కోవడానికి కేంద్రం ప్రత్యేక గ్రాంట్ ప్రకటించాలని కూడా ప్రధానిని ముఖ్యమంత్రి కోరనున్నట్టు అధికార వర్గాల సమాచారం.