రాష్ట్రీయం

ఇదిగో బ్లాక్.. అదిగో వైట్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 20: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పాత నోట్ల మార్పిడిపై బేరసారాలు పతాకస్థాయికి చేరాయి. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇదే తంతు కనిపిస్తోంది. ప్రస్తుతం 30 శాతం కమీషన్‌పై పాత నోట్ల మార్పిడి జరుగుతున్నట్టు తెలుస్తోంది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయంతో బెంబేలెత్తుతున్న నల్ల కుబేరులు ఇప్పుడు కోట్ల మొత్తంలో ఉన్న నల్లధనాన్ని ఎలా మార్చుకోవాలో అర్థంకాని స్థితిలో ఉన్నారు. ఇదే అదనుగా కొందరు బ్రోకర్లు రంగంలోకి దిగారు. ఈ బ్రోకర్లు నల్లధనాన్ని తెల్లధనంగా మారుస్తామంటూ తెరపైకి వచ్చారు.
జిల్లాలోని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తినడంతో ప్రస్తుతం ఈ నోట్ల మార్పిడి తంతులో తలమునకలయ్యా రు. తమకున్న పరిచయాలతో రోజంతా ఫోన్లు, ఇతర మార్గాల్లో నల్ల కుబేరులతో సంప్రదింపులు జరుపుతున్నారు. 2లక్షల 50వేల రూపాయలు దాటితే మిగిలిన మొత్తానికి లెక్కలు చెప్పాల్సిందేనని తెగేసి చెప్పడంతో బ్లాక్ మనీని ఏ విధంగా వైట్ చేసుకోవాలనే విషయం అర్థంకాక వారంతా తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిణామాన్ని బ్రోకర్లు తమకు పూర్తి అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. రోజువారీ వ్యాపారాలు సాగించే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు పాత 500, వెయ్యిరూపాయల నోట్లు తీసుకుని, వాటి స్థానే 100, కొత్తగా వచ్చిన 2వేల నోట్లను ఇస్తున్నారు. ప్రస్తుత మార్కెట్‌లో నడుస్తున్న తీరును పరిశీలిస్తే 30 శాతం కమీషన్ పద్ధతిపై సదరు వ్యాపార సంస్థలు నోట్ల మార్పిడికి ముందుకొస్తున్నాయి. ఈ 30 శాతంలో కనీసం 5 శాతం బ్రోకర్ల జేబుల్లోకి వెళ్ళేవిధంగా మాట్లాడుకుంటున్నారు.
ముఖ్యంగా కొందరు బ్యాంకు మేనేజర్లు కమీషన్ పద్ధతిలో బ్లాక్ మనీని వైట్‌గా మార్చే పనిలో పడినట్టు తెలుస్తోంది. ఆదివారం బ్యాంకులకు సెలవు రోజు కావడంతో జిల్లా వ్యాప్తంగా పలువురు బ్యాంకు అధికారులు అత్యంత రహస్యంగా నోట్ల మార్పిడికి పాల్పడినట్టు బయటకు పొక్కింది. ఈ వ్యవహారంలో చేయి తిరిగిన వ్యాపార వేత్తలతో పాటు బ్యాంకు అధికారులతో సన్నిహితంగా మెలిగే కొందరు బ్రోకర్లున్నట్టు తెలిసింది. తొలుత జిల్లాలో కోటికి 15 లక్షలు కమీషన్‌గా ఈ వ్యాపారం ప్రారంభమైనట్టు తెలుస్తోంది. క్రమంగా కమీషన్ పెరుగుతూ ప్రస్తుతం 30శాతం దగ్గర ఆగింది. గడువు తేదీ దగ్గర పడే సమయానికి ఈ కమీషన్ మరింత పెరిగే అవకాశాలున్నట్టు చెబుతున్నారు.
డిసెంబర్ నెలాఖరులోగా పాత నోట్లను మార్చుకునే అవకాశం ఉండటంతో ఈలోగా పేరుకుపోయిన నోట్ల కట్టలను మార్చుకోని పక్షంలో అవి చిత్తు కాగితాలుగా మారిపోయే ప్రమాదం ఉండటంతో నల్లకుబేరులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. మా వద్ద బ్లాక్ సిద్ధంగా ఉంది వైట్ ఎంత సిఆర్ సిద్ధం చేయగలరు? (కోటి రూపాయలను సిఆర్‌గా పేర్కొంటారు) అని బ్రోకర్లు మరో పార్టీతో ఫోన్లలో సంప్రదింపులు జరుపుతున్నారు. కొందరు నేరుగా రహస్య ప్రదేశాలలో సిటింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. కోటి నుండి 100 కోట్ల వరకు ఎవరి స్థాయిలో వారు నోట్ల మార్పిడికి సిద్ధమవుతున్నారు.
ఈ నోట్ల మార్పిడి ద్వారా ఎన్ని కోట్ల మేరకు లావాదేవీలు జరుగుతున్నాయన్న విషయమై ఏ ఒక్కరూ ఓ నిర్ధారణకు రాలేకపోతున్నప్పటికీ పెద్ద ఎత్తున మార్పిడి మాత్రం జరుగుతున్నట్టు తెలుస్తోంది. కోటి బ్లాక్ మనీకి 75 లక్షలు వైట్ ఇచ్చేందుకు ఎవరైనా ముందుకువస్తే బ్రోకర్ల కమీషన్ 5 లక్షలు కలుపుకొని 70 లక్షలకు కుదిస్తున్నారు. ఈ 5 లక్షల మార్జిన్‌ను ఇరువైపుల బ్రోకర్లు పంచుకుంటున్నారు. ఈ వ్యవహారంలో లావాదేవీలు సాగించే వారు, లబ్ధి పొందేవారు ఎందరో తెలియనప్పటికీ, తమకు తెలిసిన వారు, పరిచయస్తులు, బంధుమిత్రులు, సహచర వ్యాపారస్తులను ఫోన్లలో, నేరుగా సంప్రదిస్తూ, తమ వద్ద పెద్ద మొత్తంలో వైట్ ఉందని, బ్లాక్ మనీ మార్చుకునేవారెవరైనా ఉంటే తక్షణం రంగంలోకి దిగాలని కంగారు పెడుతున్నారు.