రాష్ట్రీయం

9న రైతు, విద్యార్థి గర్జన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: రైతుల రుణ బకాయిలు మాఫీ కాకపోవడం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని సంకల్పించింది. ఈ మేరకు వచ్చే నెల 9న రైతు, విద్యార్థి గర్జన పేరిట హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానం లేదా ఎల్‌బి స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) నిర్ణయించింది.
ఈ బహిరంగ సభకు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని లేదా ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోనియా గాంధీ బయటకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి రాహుల్ గాంధీని ఆహ్వానించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. రాహుల్ గాంధీ హాజరైతే తెలంగాణలోని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నూతనోత్సాహం వస్తుందని వారు భావిస్తున్నారు. ఈ మేరకు టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. మంగళవారం పార్లమెంటు సెంట్రల్ హాలులో రాహుల్‌గాంధీని కలిసి బహిరంగ సభకు హాజరుకావాల్సిందిగా కోరనున్నారు.
అయితే పెద్ద నోట్లతో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు కాబట్టి ఇప్పుడు బహిరంగ సభలు నిర్వహించడం భావ్యం కాదని రాహుల్ గాంధీ చెబితే మరో తేదీకి వాయిదా వేసుకోవాల్సి వస్తుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. వచ్చే నెల 2వ తేదీకి తెలంగాణలో టిఆర్‌ఎస్ అధికారం చేపట్టి రెండున్నర ఏళ్ళు పూర్తి కానున్నది. 9వ తేదీన బహిరంగ సభ ఎందుకు నిర్వహించాలనుకుంటున్నారంటే, ఆ తేదీన సోనియా జన్మదినం కావడమే కాకుండా ఆ రోజన తెలంగాణ ఏర్పాటుకు ప్రకటన చేయడం వల్ల ఆ తేదీని ఎంపిక చేశారు. రైతుల బకాయిలను ఒకేసారి చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా చేయడం, బ్యాంకులు కొత్తగా రుణాలు ఇవ్వకపోవడం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోవడంపై కాంగ్రెస్ ఆందోళనలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు, రైతుల, విద్యార్థుల ఆదరాభిమానాలు చూరగొనేందుకు రైతు, విద్యార్థి గర్జన నిర్వహించాలని పార్టీ నేతలు నిర్ణయించారు.