రాష్ట్రీయం

మైనింగ్ లీజుల బదిలీ చెల్లదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 22: మైనింగ్ కోసం లీజుకు తీసుకున్న క్వారీలను వేరొకరికి బదిలీ చేయడాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మైనింగ్ బదిలీల్లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలని భావించిన సిఎం, అనుబంధ పరిశ్రమలకు ఉన్న క్వారీలను మాత్రమే బదలాయించేందుకు అనుమతివ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 20 ఏళ్లుగా ఉన్న లీజు కాలాన్ని 30 ఏళ్లకు పెంచాలని సూచించారు. విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మంగళవారం గనుల శాఖపై సమీక్ష నిర్వహించారు. గాజు పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్రంలో రెండు పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. దీంతో సిరమిక్, గాజు పరిశ్రమల అభివృద్ధికి చిత్తూరులో సిరమిక్ క్లస్టర్, ఓర్వకల్లులో గ్లాస్-సిలికా క్లస్టర్ ఏర్పాటు కానున్నాయి. కృష్ణా జిల్లా మల్లవల్లిలోనూ సిరమిక్ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గ్రానైట్ మైనింగ్ సీనరేజ్, డిస్ట్రిక్స్ మినరల్ ఫౌండేషన్ రాయల్టీలు భారంగా మారాయని గనుల శాఖకు వినతుల రావడంతో ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా వసూలు చేస్తున్నారో అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. క్వారీల తవ్వకాలతో ప్రత్యక్షంగా ప్రభావం పడే పరిధిని 10 కిలోమీటర్లుగా, పరోక్షంగా ప్రభావం పడే పరిధిని 25 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ఐదువేల చదరపు అడుగులకు మించి భవనాలు నిర్మించే యజమానులనుంచి అడుగుకు 3 రూపాయల చొప్పున గ్రీన్ ఫీజును వసూలు చేయాలని సమీక్షలో నిర్ణయించారు. ఒప్పందం మేరకు సిమెంట్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయని కారణంగా కర్నూలు, గుంటూరు జిల్లాల్లో గతంలో కేటాయించిన లైమ్‌స్టోన్ బ్లాక్‌ల లీజును రద్దు చేయాలని సిఎం దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే తిరిగి దరఖాస్తులు తీసుకుంటామని, గుంటూరు జిల్లాల్లో మరో నాలుగు లైమ్ స్టోన్ బ్లాక్‌లను గుర్తించామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో గనుల శాఖకు 859 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. లక్ష్యానికి మించి అదనంగా ఆరు కోట్ల రూపాయలు
లభించడం గమనార్హం. చిత్తూరు జిల్లా చిగురుకుంటలో బంగారం వనరులు ఉన్నాయని, జియోలాజికల్ డేటా తెలియచేస్తుండటంతో ఆ గనులను వేలం వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో వేలం నిర్వహించనున్నట్లు సిఎంకు అధికారులు తెలిపారు. ఈ సమీక్షలో మంత్రి పీతల సుజాత, గనుల శాఖ డైరెక్టర్ శ్రీ్ధర్, అదనపు కార్యదర్శి రాజవౌళి తదితరులు పాల్గొన్నారు.