రాష్ట్రీయం

చిన్నబోయిన శంకరగుప్తం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలికిపురం, నవంబర్ 22 : ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు పద్మశ్రీ, పద్మవిభూషణ్, వెనీలియార్, గానగాంధర్వ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణవార్తతో ఆయన స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 1930వ సంవత్సరం జులై 6న మంగళంపల్లి పట్ట్భారామయ్య, సూర్యకాంతం దంపతులకు ఏకైక సంతానంగా జన్మించిన బాలమురళీ తన తాత త్రైయ్యాగ రంగదాసు ప్రొత్సాహంతో 7వ ఏటనే విజయవాడలోని కారుపల్లి రామకృష్ణయ్యపంతులుగారి వద్ద సంగీత సాధనచేశారు. 8వ సంవత్సరం నుండే కచేరీలు ప్రారంభించిన మురళీకృష్ణను బాలమురళీకృష్ణగా పిలుచుకోవడం ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో 25వేలకు పైగా కచేరీలు చేసిన ఘనత బాలమురళీకి దక్కింది. తిరుమల తిరుపతి దేవస్థానం, శృంగేరి పీఠంవారు బాలమురళీని తన ఆస్థాన విద్వాంసునిగా నియమించుకున్నారు. తనదైన శైలిలో ‘మహితి’ అనే రాగాన్ని రూపొందించి అప్పటి భారత ప్రధాని పివి నరసింహారావు నుండి ప్రశంశలు పొందారు. భక్తప్రహ్లాద, సందిని సింధూరం అనే చిత్రాల్లో కూడా బాల మురళీ నటించారు. 79 సంవత్సరాల వయస్సును పూర్తిచేసుకొని 80వ సంత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా 2009 జూలై 6వ తేదీన శంకరగుప్తంలో గ్రామస్థుల నడుమ బాలమురళి తన జన్మదినోత్సవం జరుపుకున్నారు. ఆయన పుట్టిన స్థలంలో గ్రామస్థులు ఒక ఆర్చి నిర్మించి, ఆయన చేత ప్రారంభింపజేశారు. గత ఏడాది మార్చి 6న గజల్స్ శ్రీనివాస్‌తో కలిసి ఆయన శంకరగుప్తం గ్రామాన్ని సందర్శించారు.
శంకరగుప్తంతోపాటు బాలమురళి తాతగారి గ్రామమైన గుడిమెళ్ళంక మంగళంపల్లి కుటుంబీకులు అధికంగా ఉన్న అంతర్వేదిపాలెం గ్రామాల్లో కూడా బాలమురళీ మృతి వార్తతో విషాదఛాయలు అలుముకున్నాయి.
శంకరగుప్తం ప్రతిష్ఠ ప్రపంచానికి చాటారు
తన గాన మాధుర్యంతో మారుమూల శంకరగుప్తం గ్రామ ప్రతిష్ఠను బాలమురళి ప్రపంచానికి చాటారని ఆయన సమకాలీకుడైన త్రైయాగ నరశింహమూర్తి అన్నారు. మంగళవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ అటువంటి మిత్రుడు మరణించడం దురదృష్టకరమన్నారు.
సంగీత సామ్రాజ్యానికే తీరనిలోటు
బాలమురళీ మరణం సంగీత సామ్రాజ్యానికే తీరని లోటు అని ఆయన సోదరి వరస అయ్యే త్రైయ్యాగ వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తంచేశారు. తన గానామృతంతో సంగీత పిపాసులందరినీ ఓలలాడించిన బాలమురళి మృతికి త్రైయ్యాగ నరశింహామూర్తి, మంగళంపల్లి భాస్కరం, పిబివి రమణమూర్తి, పియస్ ఆర్‌కె శర్మ తదితరులు ఆవేదన వ్యక్తంచేశారు. రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు బాలమురళీ మృతిపట్ల సంతాపం వ్యక్తంచేశారు.

బాలమురళి పేరిట నిర్మించిన ఆర్చి (ఫైల్‌ఫొటో)
తన జన్మదినోత్సవం జరుపుకోవడానికి వచ్చిన సందర్భంగా శంకరగుప్తం గ్రామస్థులతో
మాటామంతీ జరుపుతున్న బాలమురళి (ఫైల్‌ఫొటో)
సోదరి వెంకటలక్ష్మితో బాలమురళి (ఫైల్‌ఫొటో)