ఆంధ్రప్రదేశ్‌

వెలగపూడిలో సైక్లింగ్ ట్రాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 23: భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని విశ్వక్రీడలు, ఒలింపిక్స్‌కు వేదికగా అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాల నిర్మాణాన్ని చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. బార్సిలోనా నగర డెప్యూటీ మేయర్ ఆంథోని సిఎం చంద్రబాబును కలిసి ఇందుకు అవసరమైన వౌలిక సదుపాయాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ చేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలకశాఖ మంత్రి పి నారాయణ, సీఆర్డీయే కార్యదర్శి అజయజైన్, కమిషనర్ చెరుకూరి శ్రీధర్, అదనపు కమిషనర్ మల్లికార్జున్, రాజధాని నగర అభివృద్ధి- నిర్వహణ సంస్థ చైర్మన్ లక్ష్మీ పార్థసారథి, సిఎం కార్యదర్శి సతీష్ చంద్ర, గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే తదితరులు హాజరైన ఈ సమావేశంలో రాజధానిలో కాలుష్య నియంత్రణ అంశాలపై చర్చించారు. క్రీడా సదుపాయాలతో పాటు రాజధాని నగరంలో నివసించే బాల బాలికలలో ఫిజికల్ ఫిట్‌నెస్, క్రీడల పట్ల ఆసక్తి కలిగించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధంచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అమరావతిని కాలుష్యరహిత నగరంగా రూపొందించే క్రమంలో 16 వందల కిలోమీటర్ల మేర ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లను రూపొందిస్తున్నట్లు అధికారులు వివరించారు. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హెగన్‌లో సైతం ఇంత పెద్ద నెట్‌వర్క్ లేదన్నారు. సైకిల్ ట్రాక్ ఏర్పాటుపై ఆలిండియా బైస్కిలింగ్ ఫెడరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా వెలగపూడి సచివాలయంలో సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఫెడరేషన్ చైర్మన్ డివి మనోహర్ చెప్పారు. 43 కిలోమీటర్ల మేర ఉన్న వెలగపూడి సచివాలయంలో పబ్లిక్ బైక్ షేరింగ్ విధానంలో బైస్కిలింగ్ ట్రాక్‌లు ఏర్పాటవుతాయని వివరించారు. వంద సైకిళ్లు, ఆరు బైక్‌స్టేషన్లను మూడు నెలల వ్యవధిలో వెలగపూడిలో సిద్ధం చేస్తామని ప్రకటించారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో ఎంపికచేసిన ప్రాంతాల్లో సైకిల్‌ట్రాక్‌లను వెంటనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

తిరుపతిలో పెద్దనోట్ల దీక్ష

తిరుపతి, నవంబర్ 23: పెద్దనోట్లను రద్దుచేసి నల్లధనాన్ని వెలికితీస్తామని ఇది ఆరంభం మాత్రమేనని ప్రగల్భాలు పలుకుతున్న ప్రధాని నరేంద్రమోదీ పతనం ఆరంభమైందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. పెద్దనోట్లు రద్దుచేసి ప్రజలకు అవసరమైన చిల్లరను అందుబాటులో ఉంచకుండా ఇబ్బందులకు గురిచేసిన ప్రధాని మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, ఆర్‌బిఐ గవర్నర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణ బుధవారం తిరుపతి మునిసిపల్ కార్యాలయం వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్లను రద్దుచేసి ప్రధాని ప్రజలకు అవసరమైన డబ్బులను ప్రజలకు అందుబాటులో ఉంచకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దు విషయాన్ని ఆర్‌బిఐ గవర్నర్ ముందుగానే కార్పొరేట్ సంస్థలకు, బిజెపి నేతలకు లీక్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ ముందుగానే తమ అకౌంట్లను సర్దుకున్నారని, దీంతో నల్లధనం సర్జికల్ స్ట్రైక్ సామాన్యులపై జరిగిందన్నారు. నారాయణ చేపట్టిన దీక్షకు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణయ్య, ఎమ్మెల్సీలు ఎం.శ్రీనివాస్‌రెడ్డి,బి.బాలసుబ్రహ్మణ్యం, వైకాపా నేత భూమన్ కరుణాకర్‌రెడ్డి,లాయర్స్ అసోసియేషన్, తెలుగుభాషోద్యమ సమితి, అరసం సభ్యులు మద్దతు తెలిపారు.

తిరుపతి ఋన్సిపల్ ఆఫీసు ఎదుట సిపిఐ నేత నారాయణ దీక్ష

మనసంతా అటువైపే..!

పరిహారం తీసుకుని తెలంగాణ వెళ్తున్న పోలవరం నిర్వాసితులు ౄ ముంపు మండలాల్లో విచిత్ర పరిస్థితి

దమ్మపేట, నవంబర్ 23: రాష్ట్రం విడిపోయి ఇరు రాష్ట్రాల్లో ప్రజలు ఒక విధంగా ఉంటే ముంపుమండలాల ప్రజల పరిస్థితి మరో విధంగా ఉంది. రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు తాము ఏ ప్రాంతంలో ఉన్నామో గర్వంగా చెప్పగలుగుతుంటే ఈ మండలాల ప్రజలు మాత్రం తమను పోలవరం ప్రాజెక్టు పేరుతో గోదావరిలో ముంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్‌లో కలుపబడ్డ ఏడు ముంపు మండలాల్లో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజల పరిస్థితి విభిన్నంగా ఉంది. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వెళ్ళడం, గోదావరి ముంపు పేరుతో వారికి నష్టపరిహారం చెల్లించడం, వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి వారు ఈ ప్రాంతంలో పంటలు వేయకూడదని చెప్పడం చకచక జరిగిపోతూనే ఉన్నాయి.
అక్కడ నివసించేవారిలో సగం గిరిజనేతరులు కావడం, వారికి జంగారెడ్డిగూడెం సమీపంలో కాలనీ నిర్మించే ప్రతిపాదనలు జరుగుతున్న నేపథ్యంలో కాలనీ ఇంటికి సంబంధించి 3.5లక్షల రూపాయలను తీసుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని దమ్మపేట, అశ్వారావుపేట మండలాలకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతంతో బంధుత్వాలు కలిగి ఉండటం, కౌలు వ్యవసాయం అధికంగా ఉన్న కారణంతో పాటు విభిన్నమైన పరిస్థితులు కలిగిన ఈ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిని తిరిగి ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా అనేకమంది తాము దమ్మపేట, అశ్వారావుపేట మండలాలకే వెళ్తామని తెగేసి చెబ్తుండటం విశేషం. సుమారు 9వేల కుటుంబాలు ఈ ప్రాంతానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. గిరిజనేతరుల కుటుంబాలలోని పిల్లలు అధిక శాతం మంది తెలంగాణలోనే విద్యాబుద్దులు నేర్చుకుని ఇక్కడే స్థిరపడ్డారు. నిర్వాసితులకు ఆంధ్రరాష్ట్రంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని ఏపి ప్రభుత్వం స్పష్టం చేసినా 3.5లక్షలు పరిహారం తీసుకొని అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు తరలి రావటానికి నిర్వాసితులు సిద్ధమవుతున్నారు. మరికొందరు సత్తుపల్లి, ఖమ్మం, హైద్రాబాదు నగరాలకు వెళ్లాలని భావిస్తున్నారు. ముంపు మండలాలలో అభివృద్ధి పనులను ఇదివరకే నిలిపివేసిన ఆంధ్రా ప్రభుత్వం 2017 జనవరి నుండి అక్టోబరు వరకు దశలవారీగా ముంపు గ్రామాలన్నింటిని ఖాళీ చేయాలని సూచించింది. పరిహారం పొందినవారికి నిర్ణీత గడువు తర్వాత విద్యుత్‌తో సహా అన్ని సౌకర్యాలు నిలిపివేస్తామని అధికారులు ముంపు మండలాలలో ప్రకటించారు. ఈలోగానే కొత్త నివాసాలను ఉపాధి మార్గాలను అనే్వషించే పనిలో ముంపుగ్రామాల ప్రజలు అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు చేరుకుంటున్నారు.

నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తున్న అధికారులు