రాష్ట్రీయం

దుర్గమ్మ సేవలో సిఎం దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి), జనవరి 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ జగన్మాత శ్రీకనకదుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. అమ్మవారి భవానీదీక్షల విరమణకు ముందు రోజు శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివారి దేవస్థానం ఇవో సిహెచ్ నరసింగరావు దీక్షల విరమణ సమయంలో అమ్మవారిని దర్శించుకోవాలని స్వయంగా సియంకు విజ్ఞప్తి చేశారు. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజైన శుక్రవారం ఉదయం సియం సతీసమేతంగా ఉదయం 9గంటలకు అమ్మవారికి సన్నిధికి విచ్చేశారు.
దేవస్థానం స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్, ప్రధాన అర్చకుడు లింగంబొట్ల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఇవో దంపతులు ముఖ్యమంత్రి దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అంతరాయంలోనికి తీసుకువెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు తర్వాత అమ్మవారి ఆస్థాన మండపంలో సియం దంపతులకు దేవస్థానం అర్చకులు వీరికి అమ్మవారి దివ్య ఆశీస్సులను అందచేయగా, ఇవో సియంకు అమ్మవారి చిత్రపటం, ప్రత్యేక ప్రసాదాలను అందజేశారు. సిఎం వెంట విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాసరావు(నాని), రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

రెండో రోజూ భవానీల దీక్ష విరమణ
విజయవాడ (ఇంద్రకీలాద్రి), జనవరి 1: భవానీ దీక్షల విరమణ రెండవ రోజైన శుక్రవారం ఇరు రాష్ట్రాల నుంచి భవానీ దీక్షాపరులు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలిరావడంతో ఇంద్రకీలాద్రి శుక్రవారం భవానీలతో కిటకిటలాడింది. నూతన సంవత్సరం, అమ్మవారికి ప్రీతిపాత్రమైన శుక్రవారం రెండూ కలసిరావడంతో భవానీలు, భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. వేకువ జామునుంచే భవానీలు ఇరుముళ్లు శిరస్సుపై ధరించి భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కీర్తిస్తూ సుమారు 8 కిమీ గిరి ప్రదక్షణ చేసి మూడు కిలోమీటర్లు క్యూ మార్గంలో నడిచి ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని హోమగుండంలో ఇరుముళ్లు సమర్పించుకున్నారు. గురుభవానీల ఆధ్వర్యంలో దీక్షా మాలలను తీయించుకుని దీక్షలను విరమించారు. వేకువజామున వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భవానీలు పవిత్ర కృష్ణానదిలో స్నానాలాచరించి గురుభవానీల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇరుముళ్లను శిరస్సుపై ధరించి బృందాలుగా గిరి ప్రదక్షిణ కావించారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఇవో సిహెచ్ నరసింగరావు భవానీలకు విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేయడంతో భవానీలు ప్రశాంతమైన వాతావరణంలో దీక్షల విరమణ చేశారు.