రాష్ట్రీయం

వాయుగుండంగా మారిన అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 29: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా మారిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 1.030 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బుధవారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగాను, ఆపై తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీనికి అనుంబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని వెల్లడించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రేపటి నుంచి కోస్తాంధ్రలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా తీవ్ర వాయుగుండం ప్రభావం తమిళనాడుపై ప్రభావం చూపిస్తుందని అంచనావేస్తున్నారు.