ఆంధ్రప్రదేశ్‌

వరి రైతుకు కరెన్సీ కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 29: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం మంచి చెడులను ఎంచిచూడటం గత 20 రోజులుగా నిత్యకృత్యం కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఖరీఫ్ పండించిన వరి రైతులపై మాత్రం ఆ ప్రభావం దారుణంగా పడుతోంది. ఒకపక్క దిగుబడులు అతితక్కువగా లభిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు పండిన పంటను అమ్ముకున్నా ఇప్పట్లో నగదు చేతికి వచ్చే అవకాశం లేక అతలాకుతలమవుతున్నారు. బియ్యం లెవీ సేకరణ బాధ్యతల నుండి ఎఫ్‌సిఐ తప్పుకున్న తర్వాత రాష్ట్రంలో ఐకెపి, సహకార సంఘాల ద్వారా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలుచేయించి, మిల్లర్లతో కస్టమ్ మిల్లింగ్ చేయించి, బియ్యం తీసుకుంటోంది. రైతులు విక్రయించిన ధాన్యానికి వారి బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం నగదు జమచేస్తోంది. ఇలా జమచేసిన నగదును రైతులు వెంటనే విత్‌డ్రా చేసుకునేవారు. నిన్నటి వరకు ఈ విధానం కొంతవరకు బాగానేవుంది. అయితే తాజాగా పెద్ద నోట్ల రద్దు వ్యవహారం తెరపైకి రావడంతో తమ ఖాతాల్లో పడే నగదు ఎప్పటికి చేతికి అందేనో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వారానికి రూ.24వేలు విత్‌డ్రా వంటి ప్రకటనలు ఆర్‌బిఐ నుండి వినిపిస్తున్నా, అది నగరాల్లోని కొన్ని బ్యాంకుల ప్రధాన శాఖలకే పరిమితమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బ్యాంకు శాఖలకు నగదు సరఫరా అతి తక్కువగా ఉండటంతో రోజుకు రూ.2000 నుండి రూ.4000 వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటోంది. కొన్ని బ్యాంకులు అయితే రోజుల తరబడి నగదు లేదని బోర్డులు సైతం పెట్టేస్తున్నాయి. వరి పండించే రైతులంతా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. వారి ఖాతాలన్నీ గ్రామీణ ప్రాంత శాఖల్లోనే ఉంటాయి. అందువల్ల ధాన్యం అమ్మిన సొమ్ము ఎప్పటికి పూర్తిగా తమ చేతికొస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. ఇక ఖరీఫ్ దిగుబడులు దారుణంగా పడిపోయాయి. ఎకరాకు 22 నుండి 24 బస్తాలు మాత్రమే దిగుబడి వస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. కనీసం 30 బస్తాలైనా దిగుబడి వస్తే ఖర్చులు రాబట్టుకునే అవకాశముంటుంది. ప్రస్తుతం దిగుబడులు భారీగా తగ్గిపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.