రాష్ట్రీయం

షార్‌లో రెడ్ అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 3: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉగ్రవాదులు ప్రవేశించారని, దీంతో ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. షార్‌లోని మొదటి, రెండో ప్రధాన గేట్ల వద్ద లోపలికి వాహనాలతోపాటు, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీచేసి పంపుతున్నారు. షార్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలతోపాటు సముద్ర మార్గాన కోస్ట్‌గార్డ్స్ ముమ్మరంగా తనిఖీ చేసి షార్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. సిఐఎస్‌ఎఫ్ సిబ్బందితోపాటు పోలీసులు కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఐబి హెచ్చరికల నేపథ్యంలో షార్ భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సిఐఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు.