రాష్ట్రీయం

ఆరోగ్యశ్రీకి పాడె కట్టొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకానికి వెంటనే నిధులు మంజూరు చేసి పేదలకు వైద్య సేవలు అందించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బహిరంగ లేఖ రాశారు. కోట్లాది పేదలకు సంజీవని అయిన ఆరోగ్య శ్రీని అనారోగ్యశ్రీగా మార్చరాదని, ఈ పథకానికి పాడె కట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం శోచనీయమన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయని పక్షంలో ఈ నెల 9న ఆరోగ్యశ్రీ రోగులు, వారి బంధువులతో కలిసి జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట వైకాపా ధర్నా చేస్తుందని ఆయన ప్రకటించారు. 2016-17లో రూ.910.77 కోట్ల నిధులు అవసరమైతే, రాష్ట్రప్రభుత్వం రూ. 568.23 కోట్లను బడ్జెట్‌లోకేటాయించిందన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి ఆరోగ్య శ్రీ బకాయిలు రూ. 395.69 కోట్లు ఉన్నాయన్నారు. ఆరోగ్య శ్రీ పరిధిలో 1.30 కోట్ల మంది ప్రజలు ఉన్నారన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే కాకుండా, ప్రభుత్వాసుపత్రుల్లో సైతం ఆరోగ్యశ్రీ అమలు దాదాపుగా పడకేసిందన్నారు. కాంట్రాక్టర్లకు చెల్లింపుల్లో అవసరం లేకపోయినా, ఎవరూ అడగకపోయినా పట్టిసీమలో 21.5 శాతం మేర అదనపు చెల్లింపులు చేశారన్నారు. కాని ఆరోగ్య శ్రీ వచ్చేవరకు 50 శాతం కోతలా అని ప్రశ్నించారు. నెట్‌వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులను ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు పెండింగ్‌లో పెట్టారన్నారు. బకాయిల చెల్లింపు విషయంలోసూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రతినిధులతో చర్చలు విఫలం కావడానికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఐదు వందల కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయని, వీటిని చెల్లించని పక్షంలో సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రులు అల్టిమేటమ్ ఇచ్చే వరకు పరిస్ధితిని దిగజార్చారన్నారు. డయాలసిస్ రోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, వారానికి ఆరు వేలు చొప్పున సాలీనా ఒక్కో రోగి రూ. 3.12 లక్షలను ఖర్చుపెట్టాల్సిన అవసరం వస్తుందన్నారు. 108 వాహనం సేవలు పూర్తిగా నిలిచిపోయే పరిస్ధితి దాపురించిందన్నారు. ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అని మార్చినా ఫర్వాలేదని, కాని పేదలకు వైద్య సేవలు అందాలన్నారు. తెల్లకార్డు ఉండి కార్పోరేట్ వైద్యం అందక ప్రజలు పడుతున్న అవస్ధల మీద రాష్ట్రప్రభుత్వం తక్షణం శ్రద్ధ చూపాలన్నారు.