రాష్ట్రీయం

కార్మికులందరికీ బాంక్ అకౌంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: దేశంలో రానున్న రోజుల్లో నగదు రహిత కార్యకలాపాలే జరుగుతాయని, ఈ క్రమంలో అందరికీ బ్యాంకు అకౌంట్లు ఉండాలని కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండాలని, లేని వారు తక్షణం తమ అకౌంట్లను ప్రారంభించాలని కేంద్ర మంత్రి సూచించారు.
అబిడ్స్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కోటిమంది అసంఘటిత రంగంలోనూ, 7.9 లక్షల మంది సంఘటిత రంగాల్లో పనిచేస్తున్నారని, అసంఘటిత రంగా ల్లో లెక్క చూస్తే బీడీ కార్మికులే 4.53 లక్షల మంది ఉన్నారని, 9.36 లక్షల మంది నిర్మాణ రంగంలోనూ, 48 లక్షల మంది వ్యవసాయ రంగంలోనూ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అంతా బ్యాంకర్లు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి వారందరికీ బ్యాంకు అకౌంట్లను ప్రారంభించాలని చెప్పారు. ఇంత వరకూ 12,024 క్యాంపులు నిర్వహించారని, 56,286 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అందులో 36,474 మంది బ్యాంకు ఖాతాలను తెరవడం జరిగిందని చెప్పారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయ