రాష్ట్రీయం

ఆర్మీని వివాదాల్లోకి లాగవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: దేశ సైనిక దళాలను రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌లో ఆర్మీని రంగంలోకి దించడంపై తృణమూల్ కాంగ్రెస్ చేసిన ‘తిరుగుబా టు’ ఆరోపణలపై వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు. శనివారం నాడు ఇక్కడ పాత్రికేయులతో మాట్లాడుతూ వివాదాల్లోకి సైనిక దళాలను లాగడం జాతీయ ప్రయోజనాలకే భంగకరమని అన్నారు. ‘వాస్తవాలు ఏమిటో తెలుసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడటం సరికాదు, కాం గ్రెస్ పార్టీ నేతలు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు, ఇదేమిటి? జాతి ప్రయోజనాలు పట్టవా’ అని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ప్రతి ఏటా నిర్వహించే తనిఖీలను ఈ ఏడాది కూడా చేపట్టింది. ఇది తొలిసారి కాదు. గతంలోనూ జరిగినవే, కాకపోతే కాస్తా జాప్యం జరిగింది అంతే అని వెంకయ్య వివరణ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్, బీహార్ , జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, అస్సాం రాష్ట్రాల్లోనూ ఈ తరహా తనిఖీలు జరిగాయి, అదే బెంగాల్‌లోనూ జరిగింది అంటూ ఆయన వివరించారు. తప్పు డు ప్రచారం కావాలనే చేస్తున్నారని అన్నారు. ఆర్మీని దించడం అంటూ ఏమీ లేదని, సహజంగా జరిగే ప్రక్రియ మాత్రమేనని అన్నారు. కొద్ది రోజులు కావాలనే ఒక్కో రకమైన ప్రచారం చేస్తుంటారని, దేశంలో ఉప్పు కొరత ఏర్పడిందని కొన్నాళ్లు, బంగారాన్ని ప్రభుత్వం తీసుకుంటుందని కొన్నాళ్లు, బెంగాల్‌లో ఎమర్జెన్సీ విధిస్తున్నారని ఇలా అనవసరపు ప్ర చారం చేస్తుంటారని ఎద్దేవా చేశారు. దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు కొంత అసౌకర్యం కలిగిన మాట నిజమేనని పేర్కొంటూ, ఇది ఎంతో కాలం ఉండదని, అన్నీ త్వరలోనే సర్దుకుంటాయని పేర్కొన్నారు. ‘ఇదో మారుతున్న దశ , ఈ దశలో కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇది మన మంచికోసమే’ అని మంత్రి వ్యాఖ్యానించారు. దీర్ఘకాలిక ప్రయోజనానికి స్వల్పకాలిక నొప్పులు ఇవి అని వెంకయ్య చెప్పారు. అందుకే ప్రధాని తనకు 50 రోజుల వ్యవధి ఇవ్వాలని దేశ ప్రజలను కోరారని అన్నారు. ప్రధాని చర్యలను ప్రజలు మద్దతు ఇస్తున్నారని, వారు ఈ చర్యల వెనుక లక్ష్యాలు అర్థం చేసుకున్నారని తెలిపారు.
విద్యతో పాటు
విలువలు: వెంకయ్య
ప్రతి పాఠశాల విద్యతో పాటు నైతిక విలువలు, వ్యాయామాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శనివారం ఆంధ్రమహిళా సభ ఆధ్వర్యంలోని ఓబులరెడ్డి పబ్లిక్ స్కూల్ 27వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఆంగ్లవిద్యను నేర్చుకోవడంతో పాటు మాతృభాషను మరువరాదని పేర్కొన్నారు. జన్మనిచ్చిన తల్లి, మాతృభూమి, మాతృభాష, మాతృదేశం మరువరాదని హితవుపలికారు. భారతదేశం ఇంత వరకూ ఏ దేశంపైనా దాడి చేయలేదని, కాని పలు దేశాలు మనదేశంపై దాడి చేసి ఆక్రమించుకున్నాయని చెప్పారు. ప్రజల వద్ద బంగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్న వార్తల్లో నిజం లేదని అన్నారు. వారసత్వంగా సంక్రమించిన బంగారం విషయంలో ఎలాంటి వివాదం లేదని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ 8వ తేదీ తర్వాత నల్లధనంతో అక్రమంగా బంగారం కొనుగోలు చేసిన వారిపై మాత్రమే చర్యలుంటాయని అన్నారు.