రాష్ట్రీయం

మంత్రాలయ భద్రగజం తిరుపతికి తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, డిసెంబర్ 4: మంత్రాలయం రాఘవేంద్రస్వామి సేవలో తరించిన భద్రగజాన్ని ఆదివారం తిరుపతి జంతుప్రదర్శనశాలకు తరలించారు. వయసు పెరగడంతో జంతుప్రదర్శనశాల క్యూరేటర్ల సూచన మేరకు తరలించాలని మఠం అధికారులు నిర్ణయించారు. దీంతో ఆదివారం గజరాజును అందంగా అలంకరించి మఠం ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు భద్రగజానికి ఇష్టమైన రాగి ముద్ద, చెరుకు, రకరకాల పండ్లు తినిపించారు. భద్రగజానికి మఠం అధికారులు బరువెక్కిన హృదయాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. పూర్వ పీఠాధిపతులు శ్రీ సుజరుూంద్రతీర్థుల హయాంలో మైసూరు అడవుల నుంచి ఈ భద్రగజాన్ని మంత్రాలయం తీసుకువచ్చారు. అప్పుడు దాని వయసు 13 ఏళ్లు. దాదాపు 30 ఏళ్ల పాటు ఈ భద్రగజం మఠంలో రాఘవేంద్రస్వామి సేవలో తరించింది. నిత్యం ప్రహ్లాదరాయుల వారిని భద్రగజంపై ఊరేగించేవారు. అంతేగాక ప్రముఖులు, పీఠాధిపతులు మఠం వచ్చినపుడు స్వాగతం పలికేది.