రాష్ట్రీయం

పొంచివున్న తుపాను ముప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 6: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలోపేతం కానుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. వాయుగుండం ప్రస్తుతం విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. ఇది వాయవ్య దిశగా కదులుతూ రేపటికి తీవ్ర వాయుగుండంగాను, తరువాత 48 గంటల్లో తుపానుగాను ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనావేస్తున్నారు. ఇదిలా ఉండగా తీవ్ర వాయుగుండం తదుపరి తుపానుగా మారే అవకాశాలు మెండుగా ఉన్నట్టు వాతావరణ నిపుణులు అంచనావేస్తున్నారు. అయితే ఇది తీరం దాటే ప్రాంతంపై మాత్రం భిన్నమైన అంచనాలు వెలువడుతున్నాయి. ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేస్తుండగా, ఒడిశా, పశ్చిమ బంగ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణుడు రామకృష్ణ భావిస్తున్నారు. అంతర్జాతీయ నిపుణులు మాత్రం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య దాటే అవకాశం ఉన్నట్టు సూచిస్తున్నారు. తీవ్ర వాయుగుండం తుపానుగా మారితే దాన్ని ‘వార్థా’గా పిలవనున్నారు.