తెలంగాణ

16 నుంచి అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: శాసనసభ శీతాకాల సమావేశాలను ఈ నెల 16 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశాల నిర్వహణపై గవర్నర్‌ను కోరుతూ నోట్ పంపించాల్సిందిగా శాసనసభ కార్యదర్శి రాజాసదారామ్‌ను సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో శాసనసభ సమావేశాల నిర్వహణపై సన్నాహక సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు, శాసనసభ కార్యదర్శి రాజా సదారామ్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రులు కెటిఆర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావుతో సిఎం కెసిఆర్ చర్చించారు. శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు రోజు ఈనెల 15న ఉదయం 11.30కు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బిఏసి) సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బిఏసిలో సభను ఎన్ని రోజులపాటు నిర్వహించేది ఖరారు చేయనున్నారు. అలాగే అదే రోజు సాయంత్రం ప్రగతి భవన్‌లో తెరాస శాసనసభా పక్షం సమావేశం నిర్వహించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. అంతకుముందు 10న మధ్యహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 14న ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నట్టు సిఎం కెసిఆర్ ప్రకటించారు. సమావేశానికి మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులు, 31 జిల్లాల కలెక్టర్లు హాజరు కావాలని ఆదేశించారు. ఈనెల 16 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో 18న ఆదివారం రాష్టవ్య్రాప్తంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం తరఫున నిరుపేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ నిర్వహించాల్సిందిగా సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.