తెలంగాణ

ఆసరా పింఛనుదారులకు ‘రూపే’ కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: పంచాయతీరాజ్ శాఖలో జనవరి 10 నుండి నగదు రహితలావాదేవీలు కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ అంశంలో బ్యాంకర్లు, పోస్టల్ సిబ్బంది సహకారం అందించాలని పంచాయితీ, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. నగదు రహిత లావాదేవీలు చేపట్టే అంశంలో కూలంకషంగా చర్చించేందుకు బ్యాంకర్లు, పోస్టల్ అధికారులతో సచివాలయంలో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీని ఈ సందర్భంగా ఏర్పాటు చేశామన్నారు.
రాష్టవ్య్రాప్తంగా 35.96 లక్షల ఆసరా పింఛన్లు ప్రతినెలా ఇస్తున్నామని, ఇందులో 17.81 లక్షల పింఛన్లను పోస్ట్ఫాసుల ద్వారా ఇస్తుండగా, 13.63 లక్షల పింఛన్లను బ్యాంకుల ద్వారా ఇస్తున్నామన్నారు. బ్యాంకులు, పోస్ట్ఫాసు సౌకర్యం లేని గ్రామాల్లో దాదాపు 4.52 లక్షల పింఛన్లను నేరుగా నగదురూపంలో ఇస్తున్నామని వివరించారు. మారిన పరిస్థితిలో ఆసరా పింఛన్లంటినీ బ్యాంకుల ద్వారా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అయితే రాష్ట్రంలో ఐదువేల గ్రామాల్లో బ్యాంకు శాఖలు లేవని, ఈ గ్రామాల్లో బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా బ్యాంకు ఖాతాలు తెరవాలని ప్రతిపాదించారు. ఒక్కో బ్యాంకు రెండు గ్రామాలను దత్తత తీసుకోవాలని మంత్రి సూచించారు. జనవరి పదిలోగా ఆధార్ సీడింగ్ చేయాలని, అలాగే అందరికీ ‘రూపే’ కార్డులను అందచేయాలని కోరారు. ఆసరా పింఛన్లతో పాటు ఉపాధిహామీ కూలీలకు జనవరి 10 నుండి బయోమెట్రిక్ విధానంలో నగదు చెల్లిస్తామన్నారు.
chitram...
ఆసరా పథకంపై విలేఖరులకు వివరిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు