రాష్ట్రీయం

ఆశాజనకంగా ‘యాసంగి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణలో రబీ సాగు జోరందుకుంది. 2016 నవంబర్‌లో యాసంగి (రబీ) పంటలకు విత్తనాలు వేయడం ప్రారంభమైంది. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు జలాశయాల్లో నీరు సమృద్ధిగా చేరటంతో పాటు, బావులు, బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉంది. అలాగే వాతావరణం పంటలకు అనుగుణంగా ఉంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల పంటలకు అనుకూలమైన వాతావరణం నెలకొని ఉంది. వరి, బుడ్డలు (వేరుశనగ), మొక్కజొన్న తదితర పంటలు వేస్తున్నారు. సాధారణంగా యాసంగిలో సుమారు 30 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తుంటారు. తాజా సమాచారం ప్రకారం తొమ్మిది లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. డిసెంబర్ చివరి వరకు యాసంగి పంటలు వేయడం పూర్తవుతుంది. ఈ పంటలు ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు కోతకు వస్తాయి. యాసంగిలో విత్తనాలు వేసే మొత్తం విస్తీర్ణంలో దాదాపు 45 శాతం విస్తీర్ణం (సుమారు 14 లక్షల ఎకరాల్లో) వరి వేస్తుంటారు. నవంబర్ 15 తర్వాత యాసంగి కోసం వరి నారుమళ్లు వేసుకోవాలంటూ ప్రభుత్వం రైతులకు గత రెండు నెలల నుండి సూచిస్తుండటంతో ఇప్పుడిప్పుడే వరినారుమళ్లు వేస్తున్నారు. డిసెంబర్ 10 తర్వాత వరినాట్లు ప్రారంభమవుతాయి. వరిపంట మార్చి-ఏప్రిల్‌లో కోతకు వస్తుంది. తెలంగాణలో వరి తర్వాత ఎక్కువ విస్తీర్ణలో వేసే పంటలు బుడ్డలు, కుసుమ, పొద్దుతిరుగుడు తదితర నూనె పంటలు. ఈ పంటలు ఆరులక్షల ఎకరాల్లో వేస్తారు. ఇప్పటి వరకు మూడు లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. మొక్కజొన్న నాలుగు లక్షల్లో వేయాల్సి ఉండగా, 1.50 లక్షల ఎకరాల్లో వేశారు. శనగ, పెసర, ఉలవలు తదితర పంటలు సాధారణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో వేశారు. జొన్న పంటల లక్ష ఎకరాల్లో వేస్తున్నారు. సిద్దిపేట, నాగర్‌కర్నూలు, వనపర్తి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో 51శాతం నుండి 75 శాతం విస్తీర్ణంలో విత్తనాలు పడ్డాయి. వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, గద్వాల-జోగులాంబ, వరంగల్ (రూరల్), జయశంకర్ భూపాల్‌పల్లి, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో 26 శాతం నుండి 50 శాతం వరకు విస్తీర్ణంలో విత్తనాలు వేశారు. మిగాతా 16 జిల్లాల్లో 25 శాతం కన్నా తక్కువ విస్తీర్ణంలో విత్తనాలు పడ్డాయి. యాసంగిలో పంటలు వేసే రైతులకు రాష్ట్రప్రభుత్వం తరఫున అవసరమైన చేయూత ఇస్తామని వ్యవసాయ మంత్రి పొచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, రైతులకు అవసరమైన విత్తనాలు ఇస్తున్నామని, ఇతర అవసరాలను తీర్చేందుకు ఇప్పటికే జిల్లాల్లోని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.