రాష్ట్రీయం

వాటా తేల్చాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: కృష్ణా జలాల పంపిణీపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడంలో బోర్డు విఫలమైంది. ఈ నెల 13వ తేదీ లోగా బోర్డు చేసిన నీటి కేటాయింపులపై అభిప్రాయాలు తెలియచేయాలన్న బోర్డు కార్యదర్శి ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం తిప్పిగొట్టింది. ఈ వ్యవహారాన్ని కేంద్ర జల వనరుల శాఖ వద్ద తేల్చుకోవాలని, ఇంతకంటే మించి ఇప్పుడున్న పరిస్ధితుల్లో కేటాయింపులు చేయలేమని బోర్డు చేతులెత్తేసింది. దీంతో కేంద్రం వద్ద అమీతుమీ తేల్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. బోర్డు తమ డిమాండ్లను పట్టించుకోకుండా పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు చేస్తూ ఈ మేరకు లేఖ రాసింది. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని ఉపయోగించుకుంటున్న ఆంధ్ర రాష్ట్రానికి ఆ మేరకు నీటి కేటాయింపులను తగ్గించి తమకు ఇవ్వాలంటూ చేసిన డిమాండ్‌ను పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా ద్వారా నిర్దేశించిన దానికంటే ఎక్కువ నీటిని ఆంధ్ర ఉపయోగించుకుంటోందంటూ ఇచ్చిన గణాంకాలను బోర్డు పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. పైగా గోదావరి నీటిని కృష్ణా నదికి మళ్లిస్తున్న నేపథ్యంలో ఆ అంశాన్ని కేంద్రం పరిష్కరిస్తుందని బోర్డు పేర్కొనడంపై కూడా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మూడు అంశాలపై కేంద్రానికి లేఖ రాసినట్లు తెలంగాణ సాగునీటిశాఖ పేర్కొంది. తెలంగాణ సాగునీటి ప్రయోజనాలను హరించే విధంగా ఉన్న బోర్డు నిర్ణయాలను అంగీకరించే ప్రసక్తిలేదని తెలంగాణ సాగునీటి శాఖ బోర్డుకు స్పష్టం చేసింది. ఈ మేరకు లేఖ కూడా రాసింది. వివరాల్లోకి వెళితే రబీ సీజన్, వచ్చే వేసవి నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రాకు 87 టిఎంసి, తెలంగాణకు 43 టిఎంసి నీటిని కేటాయించింది. ఈ నీటి కేటాయింపులతో ఆగకుండా పట్టిసీమ వాటాను తేల్చే పరిధి తమది కాదని బోర్డు స్పష్టం చేసింది. ఈ వివాదాన్ని కేంద్ర జలవనరుల శాఖ లేదా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పరిష్కరిస్తుందని బోర్డు పేర్కొంది. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాలోకి మళ్లించుకుంటున్న ఆంధ్ర రాష్ట్రంకు ఉపయోగపడే విధంగా బోర్డు వ్యవహరిస్తోందని తెలంగాణ సాగునీటి శాఖ పేర్కొంది.
ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో 137 టిఎంసిల నీరు ఉంది. గత పది రోజుల్లో ఇరు రాష్ట్రాల మధ్య అనేక సమావేశాలు జరిగినా బోర్డు ఏకాభిప్రాయం కుదర్చడంలో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. గత నెల 30వ తేదీన జరిగిన సమావేశంలో తమకు 110 టిఎంసిల నీరు కావాలని ఏపి అడిగితే, తెలంగాణ 100 టిఎంసిలు కావాలని కోరింది. తెలంగాణలో చిన్న నీటి వనరులను నింపుకుని 89 టిఎంసిలు వాడుకున్నారని, కాబట్టి 30 టిఎంసిలు మాత్రమే తెలంగాణకు కేటాయించాలన్న ఏపి వాదనలపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. చిన్న తరహా వనరుల్లో నీటి నిల్వల సామర్ధ్యం 29 టిఎంసి మాత్రమేనని తెలంగాణ స్పష్టం చేసింది.

కృష్ణా, గోదావరి జలాల సంగమం.. పట్టిసీమ ప్రాజెక్టు (ఫైల్ ఫొటో)