రాష్ట్రీయం

సంక్రాంతి బరిలో విదేశీ కోడిపుంజులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 11: ఈ ఏడాది గోదావరి జిల్లాల సంక్రాంతి కోడిపందాల బరిలో విదేశీ కోడిపుంజులు కదం తొక్కనున్నాయి. తైవాన్, మెక్సికో, దక్షిణాఫ్రికా, జర్మనీ దేశాలకు చెందిన జాతుల కోడిపుంజులు ప్రస్తుతం పందాలకు సిద్ధమవుతున్నాయి. కొంద రు పెంపకందార్లు ఈ పుంజులను సేకరించి, పెంచుతున్నారు. వివరాల్లోకి వెళితే... సంక్రాంతి కోడిపందాలకు గోదావరి జిల్లాలు ప్రసిద్ధి అనే సంగతి అందరికీ తెలిసిందే. సంక్రాంతి సీజను పూర్తికాగానే మళ్లీ ఏడాది సీజను కోసం పందెం పుంజుల పెంపకం చేపడుతుంటారు. రూ.10 వేల నుండి లక్ష పైచిలుకు పలికే ఈ పుంజుల పెంపకం లాభసాటిగా ఉండటంతో పలువురు ఇదే వ్యాపకాన్ని వృత్తిగా చేపడుతుంటారు. ధనవంతులైన కొందరు పందాలరాయుళ్లయితే తమ తమ తోటల్లో జీతగాళ్లను నియమించి కోడిపుంజులను పెంచుతుంటారు. ఇలాంటి వారంతా పందాలకు అవసరమైన మేలుజాతి కోడిపుంజు పిల్లల కోసం ఎప్పటికప్పుడు గాలిస్తుంటారు. సరిగ్గా ఇలాంటి వారికి ఇంటర్‌నెట్ అయాచిత వరంగా పరిణమించింది. విదేశాల్లో ముఖ్యంగా తైవాన్, దక్షిణాఫ్రికా, మెక్సికో, జర్మనీ దేశాల్లో కోడిపుంజులు, సర్పాలు తదితరాలతో పందాలు నిర్వహిస్తుంటారు. అక్కడ ఏడాది పొడవునా ఇలాంటి పందాలు జరుగుతుంటాయి. ఈ సమాచారాన్ని ఫేస్‌బుక్, యూ ట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పెంపకందార్లు విదేశీ కోడిపుంజులను పందాల బరిలోకి దించాలని ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించి, ఈఏడాది పందాల బరిలో విదేశీ పుంజులు సందడిచేయనున్నాయి. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొందరు పెంపకందార్లు విదేశీ కోడిపిల్లలను సేకరించి, వాటిని పందెపు పుంజులుగా తీర్చిదిద్దుతున్నారు. సంక్రాంతి పందాలకు ఇక నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో వాటికి అన్ని రకాలుగా శిక్షణ ఇస్తున్నారు. సపర్యలు చేస్తున్నారు. తైవాన్, దక్షిణాఫ్రికా, మెక్సికో దేశాలకు చెందిన కోడిపుంజులకు ఎన్నో ప్రత్యేక లక్షణాలుంటాయని పెంపకందార్లు చెబుతున్నారు. ఏడాది సమయంలోనే ఇవి చాలా బలమైన కోడిపుంజుగా తయారవుతాయి. పైగా వీటికి రోగ నిరోధక శక్తి ఎక్కువ. రెండు నెలల వయస్సు పిల్లకు వ్యాక్సిన్లు ఇచ్చి చాలా జాగ్రత్తగా పెంచుతారు. ఒక విధంగా చెప్పాలంటే ఒలింపిక్ క్రీడల 100 మీటర్లు పరుగుపందెంలో పాల్గొనే క్రీడాకారుడిని ఎలా తీర్చిదిద్దుతారో వీటిని కూడా అదేవిధంగా సన్నద్ధంచేస్తామని పందాలరాయుళ్లు చెబుతున్నారు. వీటి ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తారు. పందెం బరిలో ఎక్కువ సమయం నిలవడం, ప్రత్యర్థితో దీటుగా పోరాడటం వీటి నైజం. దీనితో పలువురు పందాలరాయుళ్లు ఈఏడాది విదేశీ పుంజులపై మక్కువ చూపుతున్నారు. పిల్ల దశ నుండి ఇప్పటివరకు పెంచిన విదేశీ పుంజు ధర రూ.25 వేలు పలుకుతోంది. మరింత కఠోర శిక్షణతో రాటుదేల్చిన పుంజు పండుగ సీజను నాటికి లక్షకు పైగా పలుకుతుందని చెబుతున్నారు.

చిత్రం. తైవాన్ కోడిపుంజు