రాష్ట్రీయం

అసెంబీ లకి అధికార, విపక్షాలు సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: ఈ నెల 16నుంచి అపారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు అధికార విపక్షాలు అప్పుడే సన్నద్ధం అవుతున్నాయి. ఈసారి ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శల మధ్య వాడి, వేడిగా సమావేశాలు జరుగనున్నాయి.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే అధికార విపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. అసెంబ్లీలో అధికార పక్షం సంగతి తేలుస్తామని విపక్షం ప్రకటించగా, విపక్షాలను ఈసారి సమావేశాల్లో కడిగి పారేస్తాం అని శాసన సభావ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రకటించారు. దేశమంతా నోట్ల రద్దు వ్యవహారంతో వేడెక్కి పోయింది. ఇరవై రోజుల తరువాత కూడా పార్లమెంటు సక్రమంగా జరిగే పరిస్థితి కనిపించడం లేదు. నోట్ల రద్దు వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకున్నా, ఈసారి సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని కాంగ్రెస్ భావిస్తోంది. నోట్ల రద్దు నిర్ణయం వెలువడగానే తొలుత ముఖ్యమంత్రి కెసిఆర్ దీనివల్ల తీవ్ర నష్టం జరుగుతుందని, జీతాలకూ కోత విధించాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నెలకు 15వందల కోట్ల రూపాయల వరకు ఆదాయంలో కోత తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. ప్రధానిని కలిసిన తరువాత కెసిఆర్ నోట్ల రద్దుకు మద్దతుగా మాట్లాడారు. నోట్లరద్దు నిర్ణయం వెనక్కి తీసుకునే అవకాశం లేనందున అనివార్యంగా నగదురహిత రాష్ట్రాంగా మారాలని పేర్కొన్నారు. శాసన సభ సమావేశాల్లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించనున్నారు. కెసిఆర్ నోట్ల రద్దును తొలుత వ్యతిరేకించగానే రాష్ట్రంలో బిజెపి నాయకులు కెసిఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. అనంతరం కెసిఆర్ మద్దతు ప్రకటించడంతో బిజెపి నాయకులకు ఈ అంశంలో అసెంబ్లీలో అజెండా లేకుండా పోయింది. కాంగ్రెస్ మాత్రం నోట్లరద్దు వల్ల తలెత్తిన సమస్యలను సభలో ప్రస్తావించనుంది. నోట్ల రద్దు వ్యవహారంలో ముఖ్యమంత్రి డూడూ బసవన్నలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు భట్టివిక్రమార్క విమర్శించారు. రెండున్నర ఏళ్లకాలంలో తెలంగాణలో సాధించిన అభివృద్ధిని వివరించడానికి అధికార పక్షం ప్రాధాన్యత ఇస్తోంది. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సమావేశాలు పొడిగించాలని విపక్షాలు కోరితే ఎక్కువ రోజులు నిర్వహించడానికి సైతం సిద్ధంగా ఉన్నట్టు అధికార పక్ష సభ్యులు తెలిపారు. విపక్షాలు పారిపోయేంత వరకు సమావేశాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.
రచ్చ చేయడానికి కాకుండా సమావేశాల్లో చర్చ కోసం కాంగ్రెస్ రావాలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సూచించారు. గతంలో శాసన సభలో మాట్లాడమంటే మేం ఇంకా ప్రిపేర్ కాలేదని చెప్పారని, ఇప్పుడలా కాకుండా ముందుగానే ప్రిపేర్ అయి రావాలని సూచించారు. సభలో చర్చించే అంశాల గురించి తెలియకపోతే కాంగ్రెస్ పార్టీ తమ సలహాదారులను అడిగి తెలుసుకోని రావాలని కర్నె ప్రభాకర్ సూచించారు. మొత్తం మీద శాసన సభలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం అనివార్యంగా కనిపిస్తోంది.