రాష్ట్రీయం

ఇక డిజిటల్ బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: కరెన్సీ నిర్వహణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. అయితే కేంద్ర నిర్ణయం ప్రభావం మాత్రం రాష్ట్రంపైనా, ప్రజలపై పడుతుందని సిఎం కె చంద్రశేఖర్‌రావు అన్నారు. కేంద్ర నిర్ణయం కారణంగా రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు తలెత్తకుండా, ప్రజలు ఇబ్బందిపడకుండా రాష్ట్ర పరిధిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ప్రేక్షక పాత్ర వహించలేదు. నగదు లావాదేవీలను కనిష్టస్థాయికి తేవాలన్న కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని కచ్చితంగా అమలు చేయాలి’ అని సిఎం అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దుతోపాటు ఆర్థిక అంశాలపై కేంద్రం అనేక నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రులు, ఉన్నతాధికారులతో సిఎం చర్చించారు.
రాష్ట్రంలో నగదురహిత లావాదేవీల ప్రోత్సాహానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తలెత్తిన పరిస్థితిని ఎదుర్కొవడానికి ప్రజలను సిద్ధం కావాలని, నగదురహిత లావాదేవీలపై దృష్టి పెట్టాలని సూచించారు. మొబైల్ యాప్‌లు, ఎటిఎం కార్డులు, స్వైప్ మిషన్లు, ఆన్‌లైన్ చెల్లింపులు జరపడంపై ప్రజలకు అవగాహన కలించాలన్నారు. దీనికోసం అవసరమైన ప్రచార కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్నెట్ అవసరం లేకుండా నగదు లావాదేవీలు నిర్వహించే మొబైల్ యాప్‌లు వచ్చాయని, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నగదురహిత లావాదేవీల నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కార మార్గాలు సూచించాలన్నారు. సిద్దిపేట నియోజకవర్గం ఇబ్రహీంపూర్ గ్రామం నగదురహిత ప్రక్రియలో ఆదర్శంగా నిలిచిందన్నారు. సిద్దిపేట నియోజకవర్గం మొత్తం త్వరలో నగదురహితంగా నిలువబోతుందన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ యావత్తూ డిజిటల్ ఆర్థిక లావాదేవీల్లో ముందుండాలని సిఎం పిలుపునిచ్చారు.
కలెక్టర్లే కీలకం
కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రం అతిపెద్ద పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని సిఎం అన్నారు. పరిపాలనా విభాగాలు ప్రజలకు అందుబాటులోకి రావడంతోపాటు వాటి ఫలితాలు ప్రజలకు దక్కాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కలెక్టర్లు క్రియాశీల పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగబోతున్న నేపథ్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్లు నిర్మించనున్నట్టు వెల్లడించారు. కొత్త జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాలు నిర్మించడానికి అవసరమై స్థలాలను ఎంపిక చేయాల్సిందిగా కలెక్టర్లను సిఎం ఆదేశించారు. వచ్చే బడ్జెట్‌లో వీటి నిర్మాణాలకు నిధులు కేటాయిస్తామన్నారు. కలెక్టర్ల సమావేశంలో కొత్త జిల్లాల ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలపై చర్చించనుండటంతో సమగ్ర సమాచారంతో రావాలని ఆదేశించారు. నగదురహిత లావాదేవీలతో పాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టులు, ఆస్పత్రుల నిర్వహణ, గురుకుల విద్యాలయాలు, హరితహారం, సాదా బైనామాలు తదితర అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

చిత్రం..డిజిటల్ కరెన్సీ నిర్వహణపై సిఎం కెసిఆర్ సమీక్ష