రాష్ట్రీయం

సజావుగా సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: శాసనసభ సమావేశాలు అర్థవంతంగా జరగాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సూచించారు. రాజకీయ రచ్చకు వేదికకాకుండా ప్రజా సంబంధిత అంశాలపై విస్తృత చర్చ జరగాలని ఆకాంక్షించారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తే ఎలాంటి అంశంపైనైనా సమాధానం చెప్పడానికి, వివరణ ఇవ్వడానికి పాలకపక్షం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. శాసనసభ సమావేశాల సన్నద్ధతపై సోమవారం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో శాసనసభ వ్యవహారాల మంత్రి టి హరీశ్‌రావు, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఉన్నతాధికారులతో సిఎం చర్చించారు.
శాసనసభలో సభ్యులు ఏ అంశాన్నైనా ప్రస్తావించే అవకాశం ఉందని, సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని విషయాలపై సన్నద్ధంగా ఉండాలని, పూర్తి సమాచారం ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. మంత్రులంతా తమ శాఖల పరిధిలో జరుగుతున్న కార్యక్రమాలపై నివేదికలు సిద్ధంగా ఉంచుకోవాలని, అలాగే పాలకపక్ష సభ్యులు ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడంతోపాటు వారిచ్చే విలువైన సూచనల స్వీకరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని సిఎం స్పష్టం చేశారు.
ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నప్పటికీ, రాజకీయాల కోసం ఎవరైనా సభకు అంతరాయం కలిగించాలనే ఆలోచన చేయవద్దని సభ్యులకు ముందుగానే సూచించాలన్నారు. మంత్రుల నుంచి సమాధానం తెప్పించే బాధ్యతలను మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు.