రాష్ట్రీయం

పవన్ వల్లే మాకు మంత్రి పదవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లిరూరల్, జనవరి 3: సినీహీరో పవన్‌కల్యాణ్ చొరవతోనే తమకు మంత్రి పదవులు వచ్చాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యాలరావు స్పష్టం చేశారు. స్థానిక సత్యనారాయణమూర్తి దేవస్థానం వద్ద ఆదివారం జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి విజయానికి పవన్‌కల్యాణ్ ఎంతో తోడ్పాటు అందజేశారని పేర్కొన్నారు. ఏ జాతిలో క్రమశిక్షణ తక్కువగా ఉందంటే అది కాపుజాతిలో మాత్రమేనని, కాపులైన రంగా హత్యను సాకుగా చూపి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని, పాలకొల్లులో చిరంజీవి ఓటమికి కాపు కులస్తుల్లో క్రమశిక్షణ లేకపోవడమేనన్నారు. రాజస్థాన్‌లో మెనా అనే కులస్తులు ఉన్నారని, వారిని బిసిల్లో చేర్చుకోవాలని 90 రోజులు రైల్వేలైన్లు, జాతీయ రహదారిని దిగ్బంధించారని ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు గుర్తు చేశారు. ఈ సంఘటనలతో ప్రభుత్వం దిగివచ్చిందని, ఉద్యమం చేస్తే అలా ఉండాలని ఉదహరించారు. అయితే, కాపుకులం కూడా రాష్ట్రంలో బలమైన శక్తి అని చిరంజీవి నిరూపించారని పేర్కొన్నారు. కాపులను బిసిలో చేర్చే ప్రయత్నం చేస్తున్నామని, ఇది సాధ్యమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఆదివారం జరిగిన సమావేశంలో
మాట్లాడుతున్న
మంత్రి మాణిక్యాలరావు... వేదికపై
మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు

ఎన్ని ‘జన్మ’లెత్తినా
పరిష్కారమయ్యేనా?!

జన్మభూమిలో మళ్లీమళ్లీ అవే సమస్యలు!
ఆంధ్రభూమి బ్యూరో
కడప, జనవరి 3: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేళ్లక్రితం అధికారంలో ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన జన్మభూమి కార్యక్రమాన్ని ప్రస్తుతం కొన్ని మార్పులు, చేర్పులతో మళ్లీ ప్రవేశపెట్టారు. కడపజిల్లాలో ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి ఆదివారం 2వ రోజు కూడా దూరంగానే ఉన్నారు. గ్రామసభలకు వచ్చే పండుముసలివారు పెన్షన్లు కోరడం, బలహీన వర్గాలకు చెందిన ప్రజలు రేషన్‌కార్డులు, శాశ్వత గృహాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజి, తాగునీటి సమస్యలను అధికారుల దృష్టికి తెస్తున్నారు. గతంలోని ప్రభుత్వాలు రచ్చబండ, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, 108, 104 వాహనం, కిలో రూపాయి బియ్యం, రోష్ని, దుల్హన్ తదితర పథకాలు ప్రవేశపెట్టగా, తెలుగుదేశం ప్రభుత్వం అదే పథకాలకు ప్రత్యామ్నాయంగా పేర్లు మార్పుచేసి ప్రకటనలు గుప్పిస్తున్నారు. అధికారులు ప్రస్తుతం గ్రామసభలకు వెళ్తుండటంతో ఏ ఊరుకు వెళ్లినా పాత సమస్యల పైనే అర్జీలు, విజ్ఞప్తులు వస్తున్నాయే తప్ప కొత్త సమస్యలు ఏవీ కన్పించడం లేదు. అధికారపార్టీకి చెందిన నేతలు గ్రామసభలకు హాజరై తాము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తామని అర్జీలు, వినతిపత్రాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ఉత్తుత్తి హామీలు మాత్రం ఇస్తున్నారు. ప్రస్తుతం పెన్షన్లు, రేషన్‌కార్డులు, ఎన్‌టిఆర్ గృహాలు తదితరాలపై అధికంగా అర్జీలు వస్తున్నాయి. పదేళ్ల క్రితం గత ప్రభుత్వాల హయాంలో జిల్లాలో 7లక్షల పైబడి జిల్లాలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం చాలా మంది బడుగు,బలహీన వర్గాలకు చెందిన అర్హులైన వారే గ్రామసభలకు వచ్చి తమగోడును వెళ్లబుచ్చుకుంటున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన సానుభూతి పరులకు అర్హత ఉన్నా, లేకపోయినా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. గ్రామసభలకు వచ్చే అర్జీల్లో ఏ ఒక్కరికీ అధికారులు గట్టిగా హామీ ఇవ్వడం లేదు. గ్రామసభలకు వచ్చిన నేతలు మాత్రం పథకాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. ఆధార్‌కార్డు, ఓటర్ కార్డు, రేషన్‌కార్డు అనుసంధానించినా అర్హులు అర్హులకు పథకాలు అందడం లేదు. ఎంత పకడ్బందీగా వ్యవహరించినా చివరికి అధికార పార్టీ నేతల సిఫారసులకే అధికారులు ప్రాధాన్యత ఇస్తుండటంతో జన్మభూమి కేవలం మిథ్యగా మారుతోంది. ఎన్ని జన్మభూమి కార్యక్రమాలు నిర్వహించినా పారదర్శకత పేరిట అధికార పార్టీ కార్యకర్తలకే వివిధ పథకాల ఫలాలు అందుతున్నాయి తప్ప అర్హులకు మాత్రం మళ్లీమళ్లీ నిరాశే మిగులుతోంది.