రాష్ట్రీయం

పలు రైళ్ల రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: వర్దా తుపాను కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తూ, మరికొన్ని రూట్లలో మళ్లించినట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ట్రైన్ నెం. 12604 హైదరాబాద్-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. ట్రైన్ నెం. 17651 చెంగల్‌పట్టు-కాచిగూడ, ట్రైన్ నెం. 12669 చెన్నై సెంట్రల్-్ఛప్రా గంగా కావేరి ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నెం. 12759 చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అదేవిధంగా ట్రైన్ నెం. 16864 మన్నార్‌గుడి-్భగత్‌కి కోటి ఎక్స్‌ప్రెస్‌ను విల్లాపురం, వెల్లూర్ కాంట్..కట్పడి, మేళపాకం, రేణిగుంట స్టేషన్ల మీదుగా మళ్లిస్తున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ట్రైన్ నెం. 11018 కరైకల్-ముంబయి వెళ్లాల్సిన ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్‌ను కడ్పడి, మేళపాకం, రేణిగుంట మీదుగా, గయాకు వెళ్లాల్సిన చెన్నై ఎగ్‌మోర్ ఎక్స్‌ప్రెస్‌ను గూడూరు, రేణిగుంట, అరక్కోణం మీదుగా, ట్రైన్ నెం. 12663 హౌరా-తిర్చూరాపల్లి ఎక్స్‌ప్రెస్‌ను గూడూరు, రేణిగుంట, మేళపాకం మీదుగా మళ్లించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.