రాష్ట్రీయం

నేడు రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్ సబ్సిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 12: ఎంతోకాలం నుండి ఎదురు చూస్తున్న రైతుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలిస్తోంది. 2015 ఖరీఫ్‌లో ప్రతీకూల పరిస్థితుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులు ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ఏడాది కాలానికి పైగా ఎదురు చూస్తుండగా, ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది. ఇన్‌పుట్ సబ్సిడీ కింద రాష్ట్ర వ్యాప్తంగా 271 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో మంగళవారం జమ చేయనున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం నాడిక్కడ విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తాన్ని రైతులు ఒకే విడతలో విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించామని, ఈ నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో సమకూరుస్తున్నందున విత్‌డ్రా పరిమితి ఆంక్షలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంపై తీవ్ర ప్రభావం చెప్పారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు, భగీరథ పనులను కూడా పూర్తి చేసి ఇంటింటికి రక్షిత మంచినీటిని సరఫరా చేస్తామని చెప్పారు.