రాష్ట్రీయం

పివి రాజేశ్వరరావు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమారుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు పివి రాజేశ్వరరావు (70) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నగరంలోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రాజేశ్వరరావు అంత్యక్రియలు మంగళవారం హైదరాబాద్‌లో జరుగుతాయి.
పివి రాజేశ్వరరావు చాలాకాలం రాజకీయాల్లో కొనసాగారు. 1996లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో ప్రస్తుత కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను ఓడించారు. అయితే 1998లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఆయన దత్తాత్రేయ చేతిలో ఓడిపోయారు. రాష్ట్ర విభజనకు ముందు పిసిసి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాజేశ్వరరావు స్వతహాగా కళాభిమాని. అనేక సాంస్కృతిక సంస్థలకు ఆయన చేయూతనందించారు. పివి నరసింహారావు మరణానంతరం ఆయన పేరు మీద పివి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి, తన స్వగ్రామం వంగరలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు బంగారు, వెండి, కాంస్య పతకాలను అందించి ప్రోత్సహిస్తున్నారు. వంగరలో మోడల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు, గురుకుల పాఠశాల ఏర్పాటుకు ఆయన తన భూమిని విరాళంగా ఇచ్చారు. రాజేశ్వరరావు మృతి వార్తతో ఆయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా వంగర గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గాంధీ భవన్ ట్రస్టీ సూర్యా నాయక్ సంతాపాన్ని వ్యక్తం చేశారు.