రాష్ట్రీయం

మెట్రో రైలు స్టేషన్లలో మొ‘బైక్’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: మెట్రోస్టేషన్ల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చటమే గాక, మెట్రోస్టేషన్ల నుంచి ప్రయాణికుడి ఇంటి వరకు డ్రాప్ చేసేందుకు కాలుష్య రహిత వాహనాలను అందుబాటులో ఉంచాలన్న మెట్రోరైలు ప్రయత్నం ఫలించింది. మెట్రో స్టేషన్లలో ‘ఉబర్’ మొబైల్ యాప్‌కు అనుసంధానం చేసి ఉబర్ మొబైక్‌లను అందుబాటులోకి తేవాలని మెట్రోరైలు నిర్ణయించింది. రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు సమక్షంలో మంగళవారం గచ్చిబౌలీలోని టి హబ్‌లో ఉబర్ సంస్థతో ఓ అవగాహన ఒప్పందం కుదిరింది. ఉబర్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే ప్రయాణికుడు ఒక్క క్లిక్‌తోనే తనకు సమీపంలో ఉన్న ఉబర్ మోటో డ్రైవర్ అందుబాటులోకి వస్తాడని సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం త్వరితంగా అభివృద్ధి చెందుతున్న రాష్టమ్రని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు అన్ని రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పబ్లిక్, ప్రైవేటు, పార్టనర్‌షిప్ ప్రాతిపదికన నిర్మించిన మెట్రోరైలు ప్రాజెక్టులో భాగంగా మెట్రో స్టేషన్లలో కాలుష్య రహిత ఉబర్ మోటార్ సైకిల్ టాక్సి, మొబైక్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు ఒప్పందం కుదరటంతో మైలు రాయి దాటినట్లు ఆయన అభివర్ణించారు. ఇలాంటి వాహనాలే గాక, మరింత సురక్షితమైన, సుఖఃవంతమైన ప్రయాణం చేసేందుకు వీలుగా ప్రతి మెట్రో స్టేషన్‌కు కూడా ఫీడర్ బస్సులను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. మున్ముందు ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ బైక్‌లు, బైసైకిల్స్ వంటివి అందుబాటులోకి తెచ్చి, ప్రయాణికుడు ఇంటి నుంచి బయటకు రాగానే రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

చిత్రం..మోపెడ్‌పై టెస్ట్ రైడ్ చేస్తున్న మంత్రి కెటిఆర్