రాష్ట్రీయం

12శాతానికి సిఫార్సు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు ప్రస్తుతం ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను 12 శాతం వరకు పెంచాలంటూ పలు ముస్లిం సంస్థలు కోరాయి. ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ బుధవారం ‘బహిరంగ విచారణ’ ప్రారంభించింది. ఈ విచారణ ఈ నెల 17 వరకు కొనసాగుతుంది. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ కొనసాగుతుందని కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, సభ్యులు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, డాక్టర్ ఆంజనేయగౌడ్, జూలూరు గౌరీశంకర్ వివరించారు. తొలుత చైర్మన్ రామలు మాట్లాడుతూ, బహిరంగ విచారణ గురించి వివరించారు. ముస్లింలకు 9 నుండి 12 శాతం వరకు రిజర్వేషన్లను పెంచడమంటే ప్రస్తుతం బిసిలకు ఉన్న రిజర్వేషన్లకు భంగం కలిగించడం కాదని స్పష్టం చేశారు. బహిరంగ విచారణలో ఎవరైనా పాల్గొనవచ్చని, స్వేచ్ఛగా భావవ్యక్తీకరణ చేయవచ్చని వెల్లడించారు. బహిరంగ విచారణ తర్వాత ఈ నెల 18-19 తేదీల్లో న్యాయశాస్త్ర నిపుణులు, సామాజిక తత్వవేత్తలు, విశ్వవిద్యాలయాల ఆచార్యులు, ప్రముఖులను ఆహ్వానించి మరికొంత సమాచారం సేకరిస్తామని ఆయన వివరించారు. లిఖితపూర్వకంగా, ఆన్‌లైన్ ద్వారా, పోస్టుద్వారా ఈ నెల 19న సాయంత్రం ఐదు గంటల వరకు అభిప్రాయాలను పంపించవచ్చని చైర్మన్ సూచించారు. ఈ విచారణలో కమిషన్ సభ్యకార్యదర్శి జిడి అరుణ కూడా పాల్గొన్నారు.
విచారణ మొదటి రోజైన బుధవారం 12 సంఘాలకు చెందిన ప్రతినిధులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా బిసి కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ ఇఫ్తకారుద్దీన్ అహ్మద్ తన వాదన వినిపించారు. ముస్లిం బిసిలు విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రంగాల్లో పూర్తిగా వెనుకబడ్డారని, ఈ విషయాలను ఇప్పటికే జస్టిస్ రంగనాథమిశ్రా, సచార్ కమిటీ, అమితాబ్‌కుంద్, జస్టిస్ దాళ్వా సుబ్రహ్మణ్యం కమిషన్‌లు నిర్ధాయించాయని గుర్తు చేశారు. సుధీర్ అధ్యయన కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసిందని, అలాగే బిసి కమిషన్ కూడా వాస్తవాలను పరిశీలించేందుకు జిల్లాల వారీగా పర్యటించాలని అహ్మద్ సూచించారు. టిఎన్‌జిఓ నాయకుడు సయ్యద్ మజీదుల్లా హుస్సేనీ, ఖాజాఖయూం అన్వర్, మహ్మద్ ముషు, మహ్మద్ ఇర్ఫాన్ మొహియుద్దీన్, ఖాజా ఇమాముద్దీన్, మహ్మద్ షెహబాజ్ తదితరులు కూడా ముస్లింలకు రిజర్వేషన్లు పెంచాలని సూచించిన వారిలో ఉన్నారు. పలువురు ఈ సందర్భంగా హాజరై బిసి కమిషన్ అందచేసిన ధ్రువీకరణ అఫిడవిట్ నమూనా, అభిప్రాయ సేకరణ నమూనాలను తీసుకుని వెళ్లారు.

హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన ‘బహిరంగ విచారణ’ వేదికపై
బిసి కమిషన్ సభ్యులకు వినతిపత్రం అందజేస్తున్న ముస్లిం సంఘం ప్రతినిధులు