రాష్ట్రీయం

స్మార్ట్ సిటీలు మరో 6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 15: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీల మాదిరిగానే రాష్ట్రంలోనూ 6 పట్టణాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన ఎపి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వివరించారు. కేంద్రం విశాఖపట్నం, కాకినాడలను స్మార్ట్ సిటీలుగా ప్రకటించింది. కేంద్ర భాగస్వామ్యంతో రూ.200 కోట్లతో నగరాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా స్మార్ట్‌నగరాలుగా కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ఏలూరు, శ్రీకాకుళం, ఒంగోలును ఎంపిక చేస్తూ తీర్మానించారు. 2016 స్ట్రీట్ వెండర్స్ నిబంధనల ప్రకారం వెండర్స్‌కు లైసెన్సులు మంజూరు చేసి, ట్రాఫిక్ రద్దీలేని ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహించుకునేందుకు జోన్‌లు ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ సమీప ప్రాంతమైన జక్కంపూడిలోని 260 ఎకరాల్లో ఎకనమిక్ సిటీని పిపిపి పద్ధతిలో పారిశ్రామికరంగానికి, లైట్ అండ్ గ్రీన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో కూడా పిపిపి పద్ధతిలో షాపింగ్ కాంప్లెక్స్, ఎగ్జిబిషన్, ఎమ్యూజ్‌మెంట్ పార్క్‌తో సిటీస్క్వేర్‌ను 27 ఎకరాల్లో నెలకొల్పాలని సమావేశంలో నిర్ణయించారు. విశాఖపట్నంలోనూ 11 ఎకరాల్లో ఇంటర్నేషనల్ కనె్వన్షన్ సెంటర్‌ను పిపిపి పద్ధతిలో నిర్మించేందుకు తగిన భూ కేటాయింపు జరపాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈ సెంటర్‌లో 7 వేల మందికి వసతి, రెస్టారెంట్, 5 స్టార్ హోటళ్లు అందుబాటులోకి వస్తాయి. గుంటూరు, విజయవాడ, తెనాలి నగరాలను అభివృద్ధి చేసేందుకు అర్బన్ ఇనఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే ఓ ప్రత్యేక సంస్థ (ఎస్‌పివి)ని ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు స్థానికత ఆధారంగానే ఆ దేశంలో ఉద్యోగాలు కల్పించాలని తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు లేఖ రాసే విషయమై సమావేశంలో చర్చించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నారని, వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం చొరవ తీసుకోవాలని సమావేశం కోరింది. రాజధానికి 98 కిలోమీటర్ల ఇన్నర్, 186 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్లను నిర్మించేందుకు సమావేశం ఆమోదం తెలిపింది.

చిత్రం..వెలగపూడి సచివాలయంలో గురువారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు