ఆంధ్రప్రదేశ్‌

సత్వరం సాగునీటి పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 14: సత్వర సాగునీటి ప్రయోజన పథకంలో భాగంగా రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయటంతో పాటు రాష్ట్రానికి కావలసిన కేంద్ర సహాయం త్వరితగతిన అందేలా ఇంజనీర్లు కృషి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న పనుల ప్రగతిని బుధవారం తన కార్యాలయంలో కేంద్ర జలవనరుల సంఘం చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్టులకు సంబంధించిన ముఖ్య ఇంజనీర్లు, పర్యవేక్షక ఇంజనీర్లు, కార్యనిర్వాహక ఇంజనీర్లతో మంత్రి దేవినేని చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి రావలిన కేంద్ర సహాయం త్వరితగతిన అందేవిధంగా కృషి చేయాలని ఇంజనీర్లను కోరారు. సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద రాష్ట్రంలో గుండ్లకమ్మ, తారకరామా తీర్థసాగరం, తోటపల్లి, పుష్కరలిఫ్ట్, ముసురుమల్లి, తాడిపూడి ఎత్తిపోతల పథకం, ఎర్రకాలువ ప్రాజెక్టు, మద్దిగడ్డ ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన పథకం పరిధిలోకి ఈ ప్రాజెక్టులను తీసుకరావటం జరిగిందన్నారు. 2003-2004 సంవత్సరంలో ప్రారంభింపబడి పనులు కొనసాగుతున్నాయని, ప్రస్తుత అంచనాలు ప్రకారం ప్రాజెక్టుల విలువ 3600.65 కోట్ల రూపాయలు అని మంత్రి అన్నారు. నేటివరకు ప్రాజెక్టుల నిమిత్తం సుమారు 2,800 కోట్లు ఖర్చు చేయటం జరిగిందన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయటానికి రూ.800 కోట్లు అవసరం ఉన్నదని మంత్రి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన పథకంలోకి ప్రాజెక్టులను తీసుకురావటం వలన ఇంకనూ అవసరమైన 800 కోట్ల నిధులలో 100 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అన్నారు. కేంద్ర జలవనరుల సంఘం, చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్టుల వారీగా వివరాలను సమీక్షిస్తూ సూచించిన సవరణలతో వివరాలను ఈ నెల 31వ తేదీలోగా సమర్పించాలని కోరారు. సమావేశంలో సిడబ్ల్యుసి మెంబర్ సెక్రటరీ ఆర్‌కె గుప్తా, జాయింట్ సెక్రటరీ సత్యన్నారాయణ, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, నార్త్ కోస్ట్ సిఇ యం.టి రాజు నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.